లారెన్స్ ని నాగార్జున కొట్టాడా?
లారెన్స్ తో నాగార్జున గతంలో మాస్ అనే సూపర్ హిట్ ఇచ్చారు.ఆ తర్వాత వెంటనే డాన్ అనే సూపర్ ప్లాప్ ఇచ్చారు.లారెన్స్ టాలెంట్ ని గమనించి ఎంకరేజ్ చేసిన నాగార్జున ఇప్పుడు లారెన్స్ కనపడితే కాల్చి చంపేస్తాడేమో అన్నంత కోపంగా ఉన్నాడంటున్నారు.దానికి కారణం అనూష్క అని తెలుస్తోంది.అనూష్క విషయంలో లారెన్స్ చాలా రూడ్ గా బిహేవ్ చేయటం నాగార్జునకి పిచ్చ కోపం తెచ్చింది.మొదట అనూష్కకి తన కాంచన చిత్రంలో వేషం ఇఛ్చాడు లారెన్స్.అయితే అది లక్ష్మీరాయ్ చెసిన విషయం లేని వేషం.దాంతో అనూష్క చేయనని ఛీ కొట్టి వచ్చేసింది.ఆ తర్వాత రెబెల్ లో ఆమెను ప్రబాస్ ద్వారా బుక్ చేసాడు.
అక్కడా అనూష్కను రకరకాలుగా ఇబ్బందులు పెట్టడం ప్రారంభించటంతో ఆమె ఆ ప్రాజెక్టునుంచి బయిటకు వచ్చేసింది.ఈ విషయం తెలుసుకున్న నాగార్జున తన ఇంటికి లారెన్స్ పిలిచి చెడా మడా తిట్టాడని తెలుస్తోంది.అంతేగాక లారెన్స్ పై చేయచేసుకున్నాడని కూడా చెప్పుకుంటున్నారు.మరో ప్రక్క లారెన్స్ తన తాజా చిత్రం కాంచన హిట్ తో తనకు తిరిగేలేదు అన్నట్లు బిహేవ్ చేస్తున్నాడు.బెల్లంకొండ సురేష్ తన తదుపరి చిత్రానికి నువ్వే డైరక్టర్ వి అని అడ్వాన్స్ ఇవ్వటంతో అస్సలు ఎవరు పట్టలేని పొజీషన్ లో ఉన్నారు.ఈ వేడిలో నాగచైతన్య సినిమా పడుదామనుకున్న లారెన్స్ కు ఇది ఊహించని దెబ్బే.


Click it and Unblock the Notifications











