Don't Miss!
- Sports CSK vs LSG: శతక్కొట్టిన రుతురాజ్ గైక్వాడ్.. చితక్కొట్టిన శివమ్ దూబే!
- News బాలయ్య ఎన్నికల ప్రచార జోరు: కీలక హామీలు
- Lifestyle గాడిదపాలు అమ్మి కోట్ల వ్యాపారం.. లీటరు ధర రూ.7,000లు పైమాటే..!
- Automobiles ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌కు పోటీగా ఆంపియర్ NXG.. ఆ రోజే లాంచ్
- Technology ధర రూ.10 వేల కంటే తక్కువ ధరకే రియల్‌మి 5G స్మార్ట్‌ఫోన్.. విడుదల తేదీ ఖరారు..!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. మార్కెట్లను లాగిన మెటల్ స్టాక్స్..
- Travel ఫ్యామిలీ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, తెలంగాణలోని ఈ ప్రాంతం బెస్ట్..!
మరోసారి జూనియర్ ఎన్టీఆర్‌ను వాడుకోనున్న బాలయ్య.. చేదు అనుభవం తర్వాత..
ఎన్టీఆర్ బయోపిక్ అందించిన చేదు అనుభవం తర్వాత నందమూరి బాలకృష్ణ మరోసారి ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో సిద్ధమయ్యారు. జైసింహ తర్వాత మళ్లీ సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్‌తో జతకట్టారు. ఇటీవల ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా గురించి, కథ గురించి మీడియాలో రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా బాలయ్య సినిమా టైటిల్ గురించి ఓ వార్త వైరల్ అవుతున్నది. ఇంతకు అదేమిటంటే..
బోయపాటి శ్రీనుని పక్కన పెట్టి
అసెంబ్లీ ఎన్నికల తర్వాత బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో ఓ సినిమా ప్రారంభం కావాల్సింది. అయితే పూర్తిగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కావడంతో ప్రేక్షకుల మూడ్ సరిగా లేదనే కారణంతో ఆ సినిమాను పక్కన పెట్టేసి.. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్‌తో విభిన్నమైన కథను ఎంపిక చేసుకొన్నట్టు తెలిసింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బాలయ్య విభిన్నమైన పాత్రను చేస్తున్నట్టు సమాచారం.
జై సింహా డైరెక్టర్‌తో రెండోసారి
జై సింహ తర్వాత కేఎస్ రవికుమార్ చెప్పిన కథ నచ్చడంతో బాలయ్య వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అంతేకాకుండా కథలో కొన్ని మార్పులు సూచించి.. వాటిని సవరించాలని సలహా ఇచ్చారట. దాంతో కథలో మార్పులు చేసుకొని సెట్స్‌పైకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాక సీ కల్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ సినిమాలోని
బాలయ్య తాజా సినిమా కోసం క్రాంతి అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తున్నది. గతంలో జూనియర్ ఎన్టీఆర్ నటించిన కంత్రి చిత్రంలోని పాత్ర పేరు క్రాంతి కావడం యాదృచ్చికమే. జై లవకుశ తర్వాత బాలయ్య జై సింహ అనే టైటిల్‌తో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఒకవేళ క్రాంతి టైటిల్ నిజమైతే.. అబ్బాయ్‌ని బాబాయ్ రెండోసారి ఉపయోగించుకొన్నట్టే అనే మాట వినిపిస్తున్నది.
బాలకృష్ణ డ్యూయల్ రోలా?
తాజా సినిమాలో బాలయ్య రెండు రకాల షేడ్స్ ఉన్న పాత్రలో నటించనున్నారట. ఒకటి సీరియస్ పోలీస్ ఆఫీసర్ కాగా, మరోటి అనుకోని పరిస్థితుల్లో గ్యాంగ్‌స్టర్‌గా మారిన క్యారెక్టర్. అయితే సింగిల్ క్యారెక్టరా? డ్యూయల్ రోలా? అనే విషయంపై స్పష్టత లేదు. వివరాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది.