జైలర్ 2 మూవీలో బాలకృష్ణ.. రజనీని ఢీకొట్టించే పాత్ర కోసం నెల్సన్ ప్లాన్

దక్షిణాదిలో సంచలన విజయం సాధించడమే కాకుండా ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన జైలర్ సినిమాకు సీక్వెల్‌ శరవేగంతో రూపుదిద్దుకొంటున్నది. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ అంచనాలకు మంచి ఈ సినిమాను రూపొందిస్తున్నారనే విషయం తాజాగా విడుదలైన గ్లింప్స్ ద్వారా స్పష్టమైంది. మరోసారి బాక్సాఫీస్‌ను ముత్తువేల్ పాండ్యన్ షేక్ చేయబోతున్నారనే విషయాన్ని టీజర్ ద్వారా తెలియపరిచారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాల వివరాల్లోకి వెళితే..

జైలర్ సినిమాలో నటీనటుల ఎంపిక మాత్రమే కాకుండా వారి పెర్ఫార్మెన్స్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, మోహన్ లాల్, జాకీ ష్రాఫ్ లాంటి వాళ్లు సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. రమ్యకృష్ణ, తమన్నా భాటియా తమ నటనతో అదరగొట్టారు. దాంతో ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నది.

Is Nandamuri Balakrishna playing role in Rajinikanth s Jailer 2

ఇక జైలర్ సినిమా సాంకేతిక విషయాలు మరో ట్రెండ్ సెట్టింగ్ అంశంగా మారింది. అనిరుధ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఊహించని రేంజ్‌ను క్రియేట్ చేసింది. కెమెరా, గ్రాఫిక్ అంశాలు సినిమాకు అత్యంత బలంగా మారాయి. అయితే ఈ సినిమాకు సీక్వెల్ అనగానే రెండింతల అంచనాలు పెరిగాయి. అందుకు తగినట్టుగానే దర్శకుడు నెల్సన్ భారీ ప్లాన్‌తో ముందుకెళ్తున్నట్టు కనిపిస్తున్నది.

జైలర్ సినిమాలో నెల్సన్ ప్లాన్ ప్రకారం ఓ పాత్రలో నందమూరి బాలకృష్ణను నటింప జేయాలని అనుకొన్నారట. అయితే డేట్స్ వల్లనో.. మరో కారణంగానే అది సాధ్యపడలేదు. లేకపోతే సినిమా చేసే రచ్చను ఊహించుకోవడమే కష్టంగా ఉంది. అయితే ప్రస్తుతం జైలర్ 2 సినిమాలో బాలయ్యను తీసుకొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం.

Is Nandamuri Balakrishna playing role in Rajinikanth s Jailer 2

జైలర్ 2 చిత్రంలో శివరాజ్ కుమార్‌తోపాటు బాలకృష్ణ కూడా నటిస్తారనే విషయం చెన్నైలో జోరుగా ఓ వార్త షికారు చేస్తున్నది. డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ ఈ మేరకు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇప్పటికే బాలయ్యను సంప్రదించారనే విషయం ప్రచారంలో ఉంది. కథలో పాత్ర ఒకే అయితే బాలయ్య ఈ చిత్రంలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమనే మాట వినిపిస్తున్నది.

ఇదిలా ఉండగా, నందమూరి బాలకృష్ణ తెలుగులో వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఆయన నటించిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి‌తోపాటు ప్రస్తుతం ఆయన నటించిన డాకు మహారాజ్ సినిమా భారీ విజయాన్ని అందుకొన్నది. డాకు మహారాజ్ చిత్రం 100 కోట్ల క్లబ్‌లో చేరడం తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X