800 కోట్ల హిట్ కొట్టిన హీరోయిన్ కోసం నాని.. పాన్ ఇండియా కోసం నేచురల్ స్టార్ భారీ ప్లాన్
ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర హద్దులు చేరిగిపోవడంతో పలు క్రేజీ కాంబినేషన్లో సినిమాలు మనం చూస్తున్నాం..కాగా పాన్ ఇండియా మార్కెట్ లో ఇప్పుడు అంతా ఆడియెన్స్ ని ఎంటర్టైన్ చెయ్యడానికి ఒకో భాష నుంచి ఒకో హీరో లేదా హీరోయిన్ ఇంకా దర్శకుల కలయికలో సినిమాలు చేయడం జరుగుతుంది. ఇలా కొన్ని ఊహించని కలయికలు ఇపుడు జరుగుతూ ఉండగా ఈ లిస్ట్ లో మన తెలుగు సినిమా దగ్గరకి వచ్చే సరికి మరింత ఆసక్తికరంగా మారుతోంది.
ఇలా మన దర్శకులతో బాలీవుడ్ హీరోలు సినిమాలు చెయ్యాలని తహతహలాడుతున్నారు. కానీ ఇంకో పక్క బాలీవుడ్ హాట్ హీరోయిన్లు కూడా తెలుగు సినిమా దగ్గర వర్క్ చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. ఇలా ఇటీవల జాన్వీ కపూర్, నోరా ఫతేహి లాంటి హాట్ సెన్సేషనల్ హీరోయిన్స్ తెలుగు సినిమాలో ఎంట్రీ ఇచ్చారు.

అయితే వీరి కంటె ముందే మరికొందరు హీరోయిన్స్ కూడా బాలీవుడ్ నుంచి టాలీవుడ్ కి వచ్చారు. మరి అలా వచ్చిన స్టార్ హీరోయిన్ లలో ఓ నటి ఇప్పుడు తెలుగులో రెండో సినిమా చేసేందుకు ఓకే చెప్పినట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు బాలీవుడ్ లో ఇటీవల సంచలన విజయం సాధించిన యంగ్ బ్యూటీ శ్రద్ధ దాస్. మరి ఈమె నటించిన స్త్రీ 2 హిందీలో ఏకంగా 860 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కొత్త ట్రాక్ రికార్డ్ సెట్ చేసింది.
మరి ఇలాంటి హీరోయిన్ ని ఇప్పుడు మన టాలీవుడ్ మేకర్స్ లైన్ లో పెట్టారట. అది కూడా టాలీవుడ్ మోస్ట్ ప్రాఫిటబుల్ యంగ్ హీరో సరసన శ్రద్దా కపూర్ పేరు ఇప్పుడు పరిశీలనలో ఉందట. మరి ఆ హీరో ఎవరో కూడ కాదు నేచురల్ స్టార్ నాని సరసన అట. నాని తెలుగులో 100 కోట్ల హీరో కాగా తన రీసెంట్ చిత్రం సరిపోదా శనివారం కూడా 100కోట్ల క్లబ్ లో చేరింది. మరి తన కోసం బాలీవుడ్ ఇండస్ట్రీ రికార్డులు షేక్ చేసిన నటిని పట్టుకురావడం పాన్ ఇండియా లెవెల్లో మంచి ఇంపాక్ట్ ని కలిగిస్తుందని చెప్పొచ్చు.

కాగా ఈ క్రేజీ కలయిక ప్రస్తుతానికి చర్చల్లో ఉందట. అన్నట్టు ఈ సినిమా ఎవరితో అంటే.. నానికి దసరా అనే ఒక మాస్ హిట్ ని అందించిన యువ దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ప్లాన్ చేసిన రెండో సినిమా కోసం అన్నట్టుగా ఇప్పుడు సినీ వర్గాల్లో గట్టి వార్తలు వినిపిస్తున్నాయి.
మరి చూడాలి నాని, శ్రద్ద కపూర్ ల జంట ఓకే అవుతుందో లేదో అనేది. మరి శ్రద్దా కపూర్ ఆల్రెడీ తెలుగులో పాన్ ఇండియా హీరో రెబల్ స్టార్ ప్రభాస్ సరసన సాహో అనే భారీ యాక్షన్ ప్రాజెక్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఒకవేళ ఓకే అయితే ఈ సినిమా తర్వాత ఆమె చేసే రెండో సినిమా నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లోనే అని చెప్పాలి.


Click it and Unblock the Notifications











