Shah Rukh Khan కు నయనతార షాక్.. అట్లీ సినిమాకు గుడ్‌బై.. సమంత తెరపైకి.. అసలేం జరిగిందంటే?

డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో పీకల్లోతు కష్టాల్లో ఉన్న బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్‌కు దక్షిణాది లేడి సూపర్ స్టార్ నయనతార షాకిచ్చింది. తన కుమారుడి అరెస్ట్ కారణంగా లయన్ సినిమా షూటింగుకు షారుక్ దూరమైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నుంచి నయనతార తప్పుకొన్నట్టు బాలీవుడ్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో షారుక్ ఖాన్‌ మరో రకంగా షాక్ తగిలినట్లయిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. లయన్ సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.

వరుస ఫ్లాపులతో షారుక్ ఖాన్

వరుస ఫ్లాపులతో షారుక్ ఖాన్

గత కొద్ది సంవత్సరాలుగా వరుస ఫ్లాపులతో షారుక్ ఖాన్ సతమతవుతున్నారు. దాదాపు మూడేళ్లకుపైగా ముఖానికి మేకప్ లేకుండా కాలక్షేపం చేస్తున్నారు. మంచి స్క్రిప్టు కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే కరోనావైరస్ కారణంగా లాక్‌డౌన్ విధించడంతో రెండేళ్లు సినిమా కోసం ఆగాల్సి వచ్చింది. లాక్‌డౌన్ తర్వాత పఠాన్, లయన్ సినిమా షూటింగులు ప్రారంభమయ్యాయి.

తొలిసారి దక్షిణాది దర్శకుడితో షారుక్

తొలిసారి దక్షిణాది దర్శకుడితో షారుక్

దక్షిణాదిలో టాప్ డైరెక్టర్ అట్లీతో షారుక్ ఖాన్ తొలిసారి జతకలిశారు. కొద్ది వారాలుగా పూణేలో లయన్ సినిమా షూటింగ్‌ను చేస్తున్నారు. నయనతార, షారుక్ ఖాన్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. షూటింగు జోరుగా కొనసాగుతున్న సమయంలో ఆర్యన్ ఖాన్ అరెస్ట్ కావడంతో సినిమా షూటింగ్ వాయిదా పడింది. అయితే షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలియని పరిస్థితుల్లో ఈ సినిమా నుంచి నయనతార తప్పుకొన్నట్టు ఓ వార్త బాలీవుడ్ మీడియాలో ప్రచారం అవుతున్నది.

షారుక్ సినిమా నుంచి తప్పుకొన్న నయనతార

షారుక్ సినిమా నుంచి తప్పుకొన్న నయనతార

నయనతార తప్పుకోవడానికి కారణం ఏమిటంటే.. దర్శకుడు అట్లీ కోసం అక్టోబర్ నుంచి నవంబర్ మొదటి వారం వరకు డేట్స్ ఇచ్చారు. అయితే అక్టోబర్ తొలి వారం నుంచి ఇప్పటి వరకు షూటింగ్ నిలిచిపోయింది. అయితే నవంబర్ వేరే ప్రాజెక్టులకు సంబంధించిన షూటింగ్‌లో పాల్గొన్నాల్సి ఉన్నందున లయన్ సినిమాకు డేట్లు కేటాయించలేనని, అందుకే మూవీనుంచి తప్పుకొంటున్నట్టు దర్శకుడు అట్లీకి నయనతార చెప్పినట్టు వార్త కథనాలు వెలువడుతున్నాయి.

నయనతార స్థానంలో సమంత

నయనతార స్థానంలో సమంత

షారుక్ సినిమా నుంచి నయనతార తప్పుకోవడంతో ఆ స్థానంలో సమంత నటింప చేయాలని అట్లి ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. అయితే తొలుత సమంతకే ఈ సినిమా ఆఫర్ ఇచ్చారు. అయితే నాగచైతన్యతో బిడ్డను కనేందుకు నిర్ణయించుకోవడం వల్ల షారుక్‌తో నటించడానికి నిరాకరించారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు నాగచైతన్యతో సమంత విడాకులు తీసుకోవడంతో మళ్లీ షారుక్‌తో నటించేందుకు సిద్దమవుతున్నట్టు సమాచారం.

నయనతార తప్పుకోలేదంటూ యూనిట్

నయనతార తప్పుకోలేదంటూ యూనిట్

ఇదిలా ఉండగా, షారుక్, అట్లీ ప్రాజెక్ట్ నుంచి నయనతార తప్పుకోలేదు. అవన్నీ పుకార్లే. అలాంటి వార్తలు చదివి నవ్వుకోవడానికి బాగుంటాయి. లయన్ సినిమాలో నయనతార నటిస్తారు అంటూ యూనిట్ వర్గాలు చెప్పడంతో ఈ వ్యవహారంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ చిత్రంలో షారుక్ ఖాన్ తండ్రి కొడుకులుగా డబుల్ రోల్ చేస్తున్నారనే విషయం తెలిసిందే. ఈ చిత్రంలో ప్రియమణి కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు.

 నయనతార కెరీర్ ఇలా..

నయనతార కెరీర్ ఇలా..

ఇక నయనతార కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన నేత్రికన్, ఆరడుగుల బుల్లెట్ ఇటీవల విడుదల అయ్యాయి. రజనీకాంత్‌తో కలిసి నటించిన అన్నాతే చిత్రం విడుదలకు సిద్ధమవుతున్నది. ఇంకా తన ప్రియుడు విఘ్రేష్ శివన్ నిర్మిస్తున్న కాతు వాకులా రెండు కాదల్ చిత్రం షూటింగ్ దశలో ఉంది. అలాగే జీఎస్ విఘ్నేష్ నిర్మించే చిత్రంలోను, అలాగే యువరాజ్ దయాళన్ నటించే చిత్రంలోను, గాడ్‌ఫాదర్ చిత్రం, గోల్డ్ అనే మలయాళ చిత్రంలో నటిస్తున్నారు.

Recommended Video

Simbu's Father Given Clarity Over His Son's Marriage
నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్

నాగచైతన్యతో విడాకుల తర్వాత సమంత కెరీర్

ఇక సమంత కెరీర్ విషయానికి వస్తే.. ఆమె నటించిన ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్‌తో జాతీయ వ్యాప్తంగా పాపులారిటిని సంపాదించుకొన్నారు. నయనతారతో కలిసి కాతు వాకులా రెండు కాదల్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. అలాగే గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందిన శాకుంతలం సినిమా రిలీజ్ సిద్ధమవుతున్నది. డ్రీమ్ వారియర్ పిక్సర్స్, శ్రీదేవి మూవీస్ ప్రొడక్షన్‌లో నటిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X