అప్పుడు చెల్లెలుగా.. ఇప్పుడు హీరోయిన్‌గా.. మెగాస్టార్‌తో రొమాన్స్ కోసం స్టార్ హీరోయిన్!

ఇప్పుడు సౌత్ సినిమా దగ్గర ఉన్నటువంటి మన సీనియర్ టాప్ హీరోస్ అంతా కూడా మామూలు ఫామ్ లో లేరని చెప్పొచ్చు. వారిలో మలయాళ సినిమా నుంచి చూసుకున్నా మోహన్ లాల్ నెల వ్యవధి లోనే రెండు క్రేజీ హిట్స్ కొట్టారు. ఇక తమిళ్ లో అయితే సూపర్ స్టార్ రజినీకాంత్ ఇంకా ఉలగనయగన్ కమల్ హాసన్ ల కోసం చెప్పాల్సిన పనే లేదు.

ఇంకా మన తెలుగులో కూడా వెంకీ మామ ఏకంగా ఇండస్ట్రీ హిట్ కొట్టడం జరిగింది. బాలయ్య ఏకంగా నాలుగు వరుస బ్లాక్ బస్టర్స్ అందుకున్నారు. కానీ వీరి అందరినీ మించిన బిగ్ స్టార్ కమ్ మెగాస్టార్ మాత్రం కొంచెం వెనుకబడ్డారు. కాగా మెగాస్టార్ చిరంజీవికి వీరి అందరినీ మించిన బిగ్ హిట్స్ భారీ ఓపెనింగ్స్ ఉన్న సినిమాలు ఎప్పుడు నుంచో ఉన్నాయి. కానీ తనకి కావాల్సిన సినిమా మాత్రం ఇంకా పడలేదు.

Chiranjeevi for Anil Ravipudi Movie

ఈ క్రమంలో తాను ఇపుడు చేస్తున్న మూడు సినిమాల పట్లే భారీ హైప్ ఉంది. కాగా ఈ చిత్రాల్లో వెంకీ మామకి సంక్రాంతికి వస్తున్నాం అనే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు అనీల్ రావిపూడితో చేస్తున్న సినిమా కూడా ఉంది. కాగా ఈ సినిమాకి చిరంజీవి సరసన హీరోయిన్ ఎవరు అనే అంశం పెద్ద టాస్క్ గా మేకర్స్ కి మారింది.

సినిమా అనౌన్స్ అయ్యిన మొదటి రోజు నుంచే అనేకమంది హీరోయిన్స్ పేర్లు బయటకి వచ్చాయి కానీ ఇపుడు ఒక ఊహించని గాసిప్ వైరల్ గా మారింది. దీని ప్రకారం జస్ట్ గత కొన్నేళ్ల కితమే చిరంజీవికి చెల్లెలిగా కనిపించిన ఓ టాప్ హీరోయిన్ ఇపుడు తన సరసన రొమాన్స్ చేయనున్నట్టుగా కొంచెం ఇబ్బందికర గాసిప్ పుట్టుకొచ్చింది.

కాగా ఆ హీరోయిన్ ఎవరో కూడా కాదు తమిళ నాట సూపర్ స్టార్ హీరోయిన్ పైగా పలు కాంట్రవర్సీలతో హైలైట్ గా నిలిచే బ్యూటీ నయనతార అట. కాగా నయన్ హీరోయిన్ గా పలు సినిమాలు చేస్తూ ఇపుడు బిజీగా ఉంది. కొన్నేళ్ల కితమే మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రంలో తనకి చెల్లెలి పాత్రలో కూడా కనిపించింది. ఇది ఆమెకి తెలుగులో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన సినిమా.

కానీ ఇపుడు మళ్ళీ అదే చిరంజీవితో అప్పుడు చెల్లెలిగా నటించి ఇపుడు హీరోయిన్ గా కూడా చేస్తుంది అని రూమర్స్ మొదలయ్యాయి. మరి వీటిలో ఎంతమేర నిజం ఉంది అనేది వేచి చూడాల్సిందే. ఇక ప్రస్తుతం తమిళ్ లోనే నయన్ పలు సినిమాలు చేస్తుండగా చిరంజీవి తన విశ్వంభర పనుల్లో బిజీగా ఉన్నారు.

మొన్న ఉగాది కానుకగా అనౌన్స్ అయ్యిన అనీల్ రావిపూడి ప్రాజెక్ట్ విశ్వంభర పనులు అయ్యిన వెంటనే మొదలై శరవేగంగా కంప్లీట్ చేసి వచ్చే ఏడాది సంక్రాంతి రేస్ లో ఎట్టి పరిస్థితుల్లో దింపేయాలని మేకర్స్ టార్గెట్ ఆల్రెడీ పెట్టేసుకున్నారు. ఒక పక్కా ఎంటర్టైనర్ ని అనీల్ మెగాస్టార్ తో అందించనున్నాడని భోగట్టా.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X