నయనతారకు బంపర్ ఆఫర్.. బాలీవుడ్ లో మరో భారీ మూవీలో!
సౌత్ ఇండియా సినిమా దగ్గర ఉన్నటువంటి పలువురు టాప్ స్టార్ హీరోయిన్స్ లో తమిళ్ సూపర్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా ఒకరు. ఇప్పుడు నయనతార మళ్ళీ సినిమాల్లో ఫుల్ బిజీగా కనిపిస్తుండగా ఒక్క తమిళ్ లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా పలు భారీ సినిమాలు చేస్తుంది. అయితే సౌత్ నుంచి బాలీవుడ్ మార్కెట్ లోకి వెళ్లిన కొంతమంది సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో నయన్ కూడా ఒకరు.
మరి నయన్ బాలీవుడ్ సినిమాలో మొట్ట మొదటిగా అది కూడా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తో తమిళ దర్శకుడు అట్లీతో "జవాన్" అనే సినిమా చేసింది. ఇలా తాను కూడా పాన్ ఇండియా హీరోయిన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లోనే మరో క్రేజీ అండ్ బిగ్గెస్ట్ ఆఫర్ ని ఆమె సొంతం చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా ఒక బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్ సినిమా సిరీస్ లో ఈమె నటిస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఉన్నటువంటి సీక్వెల్ లేదా ఫ్రాంచైజ్ సిరీస్ లు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు నిర్మాణ సంస్థ యష్ రాజ్ ఫిల్మ్స్ వారి నుంచి ఒక స్పై యూనివర్స్ వచ్చింది. పఠాన్, వార్, టైగర్ అంటూ సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్ అలాగే షారుఖ్ ఖాన్ లు చేస్తున్నారు. కాగా ఇది కాకుండా దీనికి ముందు నుంచే మరో క్రేజీ యాక్షన్ ఫ్రాంచైజ్ కూడా బాలీవుడ్ లో ఉంది.
కాగా ఆ సిరీస్ నే "ధూమ్". పోలీస్ - దొంగ నేపథ్యంలో మొదలైన ఈ చిత్రం బాలీవుడ్ లో భారీ హిట్ అయ్యింది. అప్పుడు నుంచే ఈ సిరీస్ పాన్ ఇండియా రిలీజ్ కి వచ్చింది. చివరిగా మూడో సినిమా అమీర్ ఖాన్ తో వచ్చింది. "ధూమ్ 3" లో అమీర్ ఖాన్ యాంటీ హీరోగా నటించగా అభిషేక్ బచ్చన్ నే పోలీస్ గా కొనసాగాడు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నాలుగో సినిమాకి ఇప్పుడు రంగం సిద్ధం అవుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

కాగా ఇప్పుడు ఈ నాలుగో సినిమాలోనే నయనతార నటిస్తున్నట్టుగా వినిపిస్తుంది. అయితే ఈసారి సిరీస్ లో కొన్ని మార్పులు ఉంటాయట. అభిషేక్ పాత్రని ప్రముఖ హీరో అక్షయ్ కుమార్ రీప్లేస్ చేస్తాడని అతడికి గర్ల్ ఫ్రెండ్ కం పోలీస్ గానే నయనతార కనిపిస్తుంది అని సినీ వర్గాల్లో రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి ఇదే కానీ నిజం అయితే బాలీవుడ్ విషయంలో నయనతార సెలక్షన్ అండ్ ప్లానింగ్ మామూలుగా లేదనే చెప్పాలి.
కాగా ఈ భారీ సినిమాని హిందీలో యాక్షన్ సినిమాలు వార్, బ్యాంగ్ బ్యాంగ్, వార్ రీసెంట్ గా ఫైటర్ సినిమాలు తెరకెక్కించిన దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తాడని వినికిడి. కాగా ఈసారి నాలుగో ఇన్స్టాల్మెంట్ లో మరోసారి హృతిక్ రోషన్ యాంటీ హీరోగా కనిపిస్తాడని తెలుస్తుంది. కాగా ఆల్రెడి ధూమ్ 2 లో కూడా హృతిక్ రోషన్ నటించిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications











