అబ్బ! నయనతార బికినీ అందాలు మళ్లీ?
హైదరాబాద్: సౌతిండియా హాట్ హీరోయిన్ నయనతార 2007లో అజిత్ హీరోగా విడుదలైన తమిళ చిత్రం బిల్లాలో బ్లాక్ బికినీ తొడిగి హాట్ హాట్‌గా కనిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నయనతార బికినీలో కనిపించ లేదు. తన ఇమేజ్ డామేజ్ అవుతుందనే సాకుతో...ఇంతకాలం బికినీలకు దూరంగా ఉంటూ వస్తోంది.
తాజాగా నయనతార అభిమానులకు అందుతున్న హాట్ న్యూస్ ఏమిటంటే...నాగార్జునతో కలిసి లవ్ స్టోరీ చిత్రంలో నటిస్తున్న నయనతార చిత్రంలో బికినీ వేసి అందాలు ప్రదర్శించనుందట. అదే జరిగితే నయనతార అభిమానులకు కన్నుల పండగే.
ప్రస్తుతం నయనతార క్రిష్ దర్శకత్వంలో రాణా హీరోగా రూపొందుతున్న 'కృష్ణం వందే జగద్గురుమ్' చిత్రంతో పాటు, దశరథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'లవ్ స్టోరీ' చిత్రంలో నాగార్జున ప్రేయసిగా నటిస్తోంది.
ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం...లవ్ స్టోరీ చిత్రంలో బీచ్ సాగ్ ఉందని, బ్యాంకాక్ బీచ్ అందాల మధ్య నయనతార బికినీ అందాలు షూట్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారి సమాచారం. చాలా కాలం బికినీలకు దూరంగా ఉన్న నయనతార తన సెకండ్ ఇన్సింగ్స్ మొదలు పెట్టిన నేపథ్యంలో ఫ్యాన్స్ కు అందాల విందు చేయాలని డిసైడ్ అయిందట.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న 'లవ్ స్టోరీ'లో నాగార్జున ఓ ఎన్నారైగా కనిపించనున్నారు. అనీల్ బండారి ఈ చిత్రానికి కెమెరా మెన్ గా చేస్తున్నారు. కామాక్షి మూవీ బ్యానర్ పై చందన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











