సల్మాన్ ఖాన్‌కు జోడీగా ఆ స్టార్ హీరోయిన్? క్రేజీ కాంబోతో దిల్‌రాజు మాస్టర్ ప్లాన్!

డిస్ట్రిబ్యూటర్‌గా కెరీర్ ప్రారంభించి స్టార్ ప్రొడ్యూసర్‌గా ఎదిగారు దిల్‌రాజు. తక్కువ కాలంలోనే 50కి పైగా సినిమాలు నిర్మించి తిరుగులేని స్థాయికి చేరుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమను శాసించే నలుగురిలో దిల్‌రాజు కూడా ఒకరని ఫిలింనగర్ జనాల మాట. ఇప్పటి వరకు తెలుగులోనే సినిమాలు నిర్మిస్తూ వచ్చిన దిల్‌రాజు.. ఇతర భాషల్లోనూ సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు దిల్‌రాజు.

Also Read
ఫ్లాపులతో ఐరన్‌లెగ్‌గా... కట్ చేస్తే 12 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా, ఆ హీరోయిన్ ఎవరంటే?
ఫ్లాపులతో ఐరన్‌లెగ్‌గా... కట్ చేస్తే 12 వేల కోట్ల ఆస్తికి అధిపతిగా, ఆ హీరోయిన్ ఎవరంటే?

ప్రస్తుతం తెలుగు సినిమా రేంజ్ పాన్ ఇండియా మార్కెట్‌ను దాటి పాన్ వరల్డ్ మూవీగా మారుతోంది. టాలీవుడ్‌లో సినిమాలు నిర్మించేందుకు బడా కంపెనీలు కూడా రెడీగా ఉన్నాయి. అయితే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు ఏళ్ల క్రితమే పలు భాషల్లో సినిమాలు నిర్మించారు. ఎల్వీ ప్రసాద్, డాక్టర్ డీ రామానాయుడు, సూపర్‌స్టార్ కృష్ణ, అల్లు అరవింద్ తదితరులు హిందీ సహా పలు భాషల్లో సినిమాలు తెరకెక్కించారు.

Is Nayanthara joins Salman Khan for Dil Raju and Vamshi Paidipally Movie

వీరి బాటలోనే దిల్‌రాజు కూడా తన ప్రొడక్షన్ కంపెనీని విస్తరించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే తమిళ సూపర్‌స్టార్, దళపతి విజయ్‌తో వారిసు సినిమాను నిర్మించారు. ఈసారి ఏకంగా బాలీవుడ్‌పైనే దిల్‌రాజు గురిపెట్టారు. అది కూడా ఏకంగా కండలవీరుడు సల్మాన్ ఖాన్‌తో. ప్రస్తుతం సల్మాన్ కెరీర్ ఏమాత్రం బాలేదు. సికందర్ నిరాశపరచగా.. త్వరలో మాతృభూమి సినిమాతో ప్రేక్షకులను పలకరించనున్నారు. తన కెరీర్ డైలమాలో ఉన్న ప్రతిసారి దక్షిణాది దర్శకులతో జత కట్టడం సల్లూభాయ్‌కి అలవాటు. అందుకే ఈసారి తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో సినిమాకు సల్మాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్‌రాజు నిర్మించనున్నారట.

Recommended For You
'స్టార్ పక్కన ఆఫర్ పేరుతో ట్రాప్... అలా ఆశచూపి తీరని మోసం'
'స్టార్ పక్కన ఆఫర్ పేరుతో ట్రాప్... అలా ఆశచూపి తీరని మోసం'

సల్మాన్ - దిల్‌రాజు మూవీకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతుండగా.. నటీనటులు, షూటింగ్ లోకేషన్స్ ఎంపిక, ఇతర పనుల్లో చిత్ర యూనిట్ బిజీగా ఉన్నట్లుగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఏప్రిల్‌లో ఈ సినిమా అధికారికంగా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. తన సినిమాలను ప్రతియేటా రంజాన్ పర్వదినం సందర్భంగా విడుదల చేయడం సల్మాన్‌కు ఒక సెంటిమెంట్. గతంలో వాంటెడ్, దబాంగ్ చిత్రాలు ఈద్‌కు విడుదలై మంచి విజయాన్ని అందుకున్నాయి.

You May Also Like
Ustaad Bhagat Singh Day 10 Collections: భారీ నష్టాల్లో ఉస్తాద్‌ భగత్ సింగ్.. పవన్ మూవీకి 10వ రోజు ఎంతంటే?
Ustaad Bhagat Singh Day 10 Collections: భారీ నష్టాల్లో ఉస్తాద్‌ భగత్ సింగ్.. పవన్ మూవీకి 10వ రోజు ఎంతంటే?

అంతేబాగానే ఉంది కానీ... సల్మాన్- దిల్‌రాజు మూవీలో హీరోయిన్ ఎవరు? అంటూ పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సల్మాన్ ఖాన్ సరసన లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. సల్మాన్ వంటి సూపర్‌స్టార్‌ పక్కన నటించాలంటే ఆ రేంజ్ ఉండాల్సిందే. ఆయన ఛరిష్మా, వయసు రీత్యా నయనతార అయితే పర్ఫెక్ట్‌గా సెట్ అవుతారని దిల్‌రాజు- వంశీ పైడిపల్లి భావిస్తున్నారట. ఇప్పటికే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ సరసన జవాన్ మూవీలో నయన్ నటించారు. ఇప్పుడు సల్మాన్ ప్రాజెక్ట్ ఓకే అయితే కనుక.. ఇది ఆమెకు బాలీవుడ్‌‌లో రెండో సినిమా. మరి నిజంగానే సల్మాన్ ఖాన్ హీరోయిన్‌గా నయనతార ఫిక్స్ అయ్యారా? లేక ఇదంతా గాలివార్తా అనేది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Read more about: nayanthara salman khan dil raju
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X