twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    రాణా 'నేను నా రాక్షసి' చిత్రం ఆ హాలీవుడ్ సినిమాకు కాపీ

    By Srikanya
    |

    ఈ రోజు విడుదల అవుతున్న'నేను నా రాక్షసి'చిత్రం 2001లో విడుదలైన 'కిల్ మీ లేటర్' అనే హాలీవుడ్ సినిమాకు కాపీ అని అంటున్నారు. దానకి కారణం 'కిల్ మీ లేటర్'కీ 'నేను నా రాక్షసి'కీ కాన్సెప్ట్ పరంగా పోలికలు ఉండటమే అంటున్నారు.'కిల్ మీ లేటర్'లో హీరో ప్రొఫెషనల్ కిల్లర్. హీరోయిన్ ఎప్పుడూ ఆత్మహత్య చేసుకోవాలనే జీవితాశయంతో ఉంటుంది. ఇక 'నేను నా రాక్షసి' చిత్రంలో కూడా రాణా, ఇలియానా పాత్రలు అలాగే ఉన్నాయి. దాంతో దర్శకుడు పూరి జగన్నాధ్ 'కిల్ మీ లేటర్' సినిమాను కాపీ కొట్టి ఈ చిత్రం తీసాడని అంటున్నారు.

    అయితే రాణా మాత్రం నేను సినిమాల్లో పుట్టి పెరిగాను. భాషతో సంబంధం లేకుండా రోజూ ఏదో ఒక సినిమా చూస్తాను. టర్కీ, కొరియా చిత్రాలు కూడా వదిలిపెట్టను. ఇన్ని సినిమాలు చూసిన నాకు... ఎక్కడా ఇలాంటి కథ కనిపించలేదు. ప్రతి సినిమాకీ ఎక్కడో ఒక చోట పోలిక ఉంటుంది. 'లీడర్‌'లో నటించేటప్పుడు అమెరికా ప్రెసిడెంట్‌, వైట్‌ హౌస్‌ నేపథ్యంలో వచ్చిన చిత్రాలను పరిశీలించాను. కానీ ఈ చిత్రానికి మాత్రం నాకు ఆ అవకాశమే దొరకలేదు. ఇలాంటి సినిమా ఏదైనా ఒకటి చూపించండి సార్‌ అని పూరి జగన్నాథ్‌ని అడిగితే... 'నా స్క్రిప్టే నీకు రెఫరెన్స్‌' అని చెప్పారు. చిత్రంలో ఒక ప్రొఫెషనల్‌ కిల్లర్‌ పాత్ర పోషించాను. ప్రతి సన్నివేశం ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచుతుంది అన్నారు.

    English summary
    ‘Nenu Naa Rakshasi’ film with almost similar nature was released in Hollywood with the title ‘Kill Me Later’ somewhere during 2001.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X