యువ హీరోతో నిధి అగర్వాల్ పెళ్లి? తండ్రి కామెంట్స్‌తో
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అందంతోపాటు అభినయం కలిసి ఉన్న హీరోయిన్లలో నిధి అగర్వాల్ ఒకరు. ఆమె హిందీ సినిమా రంగం ద్వారా వినోద పరిశ్రమలోకి వచ్చినప్పటికీ.. దక్షిణాది సినీ పరిశ్రమ ప్రేక్షకులకే ఎక్కువగా చేరువ అయ్యారు. అయితే ఇటీవల కాలంలో ఆమె నటించిన సినిమాలు చాలా అరుదుగా వస్తుండటంపై ఆమె స్పందించారు. అలాగే తన పెళ్లి గురించి సౌత్ మీడియాలో వస్తున్న వార్తలపై క్లారిటీ కూడా ఇచ్చారు. అయితే నిధి అగర్వాల్ చెప్పిన విషయాల్లోకి వెళితే..
నేను ఇటీవల చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నాననే విషయంపై నా ఫ్యాన్స్ కంప్లయింట్ చేస్తున్నారు. నిజంగా నా సినిమాలు చాలా తక్కువగా రిలీజ్ అయ్యాయి. అందుకు కారణం మంచి కథలు, మంచి పాత్రలు కోసం చూసి.. నాకు ఇష్టమైన వాటిలోనే నటిస్తున్నాను. అందుకే నా సినిమాలు ఎక్కువగా రిలీజ్ కాలేదు. కానీ నేను నటించిన సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి అని నిధి అగర్వాల్ చెప్పారు.

పవన్ కల్యాణ్‌తో కలిసి నేను నటించిన హరిహర వీరమల్లు ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కొన్ని కారణాల వల్ల ఆది ఆలస్యమైంది. ఆ సినిమా రిలీజ్ ఆలస్యానికి కారణాలు ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మే 9వతేదీన ఆ సినిమా రిలీజ్ అవుతున్నది. ఆ తర్వాత సౌత్‌లో నేను నటించిన సినిమాలు వరుసగా రిలీజ్ అవుతాయి. కాబట్టి ఇక నుంచి నా అభిమానులను ఎట్టి పరిస్థితుల్లోను నిరాశపరచను అని నిధి అగర్వాల్ అన్నారు.
అయితే తమిళ హీరో శింబుతో వివాహం గురించి వస్తున్న వార్తలను ఖండించారు. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నాను. ప్రస్తుతం నా ఫోకసంతా రాబోయే సినిమాలపైనే. నా ముందుకు మంచి కథలు, డిఫరెంట్ పాత్రలు వస్తున్నాయి. అందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ప్రస్తుతానికి నేను కెరీర్ మీదే దృష్టిపెట్టాను అని నిధి తెలిపారు.
ఈశ్వరన్ సినిమాలో కలిసి నటించిన తర్వాత నుంచి నిధి, శింబు మధ్య రిలేషన్‌షిప్ ఉందని రూమర్లు వచ్చాయి. వారిద్దరి మధ్య బంధం మరో మెట్టు ఎక్కింది. వారిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల తెలుగు మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నా కొడుకు ప్రేమ వివాహం చేసుకోబోతున్నారు అని చెప్పడంతో నిధి, శింబు పెళ్లి వార్త మరోసారి తెరపైకి వచ్చింది.


Click it and Unblock the Notifications











