ప్యారడైజ్ విలన్‌తో నిహారిక డేటింగ్? రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన హీరోయిన్?

నటీనటుల డేటింగ్, బ్రేకప్ వార్తలు ఇటీవలి కాలంలో టాప్ ట్రెండింగ్‌లో ఉంటున్నాయి. సడెన్‌గా తమ పార్ట్‌నర్స్‌ను పరిచయం చేయడం, అంతే వేగంగా బ్రేకప్ చెప్పుకోవడం నిత్యకృత్యంలా మారింది. కోలీవుడ్ నటి బ్రిగిదా సాగా తాను ఓ హీరోతో రిలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించి షాక్ ఇవ్వగా.. టాలీవుడ్ నటి నిహారిక ఎన్ఎం ఓ నటుడితో క్లోజ్‌గా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీరిద్దరూ డేటింగ్‌తో ఉన్నారంటూ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వివరాల్లోకి వెళితే..

చెన్నైలో స్థిరపడిన కన్నడ కుటుంబంలో జన్మించింది నిహారిక ఎన్ఎం. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఆమె ముంబైలో స్థిరపడింది. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉన్నప్పటకీ చదువును మాత్రం నిర్లక్ష్యం చేయలేదు. ఇంజనీరింగ్, ఎంబీఏ పట్టాలు పొందారు నిహారిక. ఆమె కాలేజీ చదువుతున్న రోజుల్లో యూట్యూబ్ ట్రెండ్ ప్రారంభమైంది.. ఆ సమయంలో టైం పాస్‌కి కొన్ని వీడియోలు చేస్తూ వచ్చిన నిహారికకు భారీ ఫాలోయింగ్ దక్కింది. ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌తో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఆమెకు ఇన్‌స్టాలో దాదాపు 3.3 మిలియన్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు.

Is Niharika NM dating Actor Raghav Juyal cosy Photos spark dating rumours

సరదాగా వీడియోలు చేస్తే ఓకే కానీ.. అదే కెరీర్‌గా ఎంచుకుంటే మాత్రం ఊరుకునేది లేదని తల్లిదండ్రులు ముందే హెచ్చరించారు. కానీ కాలక్షేపానికి పెట్టిన ఛానెల్, ఇన్‌స్టా పేజీలే నిహారికను సెలబ్రిటీగా మార్చాయి. 2024లో ప్రతిష్టాత్మక 77వ కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌‌కు భారతదేశం నుంచి కంటెంట్ క్రియేటర్ల జాబితాలో నిహారిక ఎంపికైంది. ఓ సాధారణ యూట్యూబర్‌ ఈ ఘనత దక్కించుకోవడం మామూలు విషయం కాదు. గతేడాది కోలీవుడ్‌లో వచ్చిన పేరుసు మూవీతో నిహారిక నటిగా వెండితెరపై ఎంట్రీ ఇచ్చారు. ఆ వెంటనే ప్రియదర్శి హీరోగా వచ్చిన మిత్రమండలిలో హీరోయిన్‌గా టాలీవుడ్‌లో అడుగుపెట్టారు. తన అందం, అభినయంతో తెలుగు కుర్రాళ్లను గిలిగింతలు పెట్టారు నిహారిక.

సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటే నిహారిక ఎప్పటికప్పుడు తన సినిమాలు, సిరీస్, షూటింగ్స్ ఇతర వ్యక్తిగత వివరాలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆమె తాజాగా షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె నటుడు రాఘవ్ జయల్‌తో క్లోజ్‌గా ఉన్నారు. నిహారిక ఎరుపు రంగు స్వెట్ షర్ట్‌లో ఉండగా ఆమెను వెనుక నుంచి రాఘవ్ హత్తుకుంటున్నాడు.

ఇక రాఘవ్ జుయల్ విషయానికి వస్తే డెహ్రాడూన్‌కి చెందిన ఈ నటుడు.. డ్యాన్స్‌లో స్లో మోషన్ స్టైల్‌తో ప్రేక్షకులను అలరించారు. అభిమానులు ఈయనను ముద్దుగా కింగ్ ఆఫ్ స్లో మోషన్ అని పిలుచుకుంటారు. డ్యాన్స్ ఇండియా డ్యాన్స్ 3, డ్యాన్స్ ఇండియా లిటిల్ మాస్టర్స్ 2, డ్యాన్స్ కే సూపర్ కిడ్స్ వంటి రియాలిటీ షోలతో ఆకట్టుకున్నాడు. అనంతరం సోనాలీ కేబుల్ మూవీతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత ఏబీసీడీ 2, నవాబ్ జాదే, స్ట్రీడ్ డ్యాన్సర్ 3డీ, బహుత్ హువా సమ్మాన్, కిసి కా భాయ్ కిసికి జాన్, కిల్, యుధ్ర తదితర సినిమాలలో నటించారు. ప్రస్తుతం కింగ్, హాసల్‌తో పాటు నేచురల్ స్టార్ నాని హీరోగా వస్తోన్న ది ప్యారడైజ్‌లో విలన్‌గా తెలుగులో ఎంట్రీ ఇస్తున్నారు.

కాగా.. నిహారిక షేర్ చేసిన ఫోటోలకు లవ్ ఎమోజీ, ఉంగరాన్ని జత చేయడంతో ఇద్దరి మధ్య ఏం జరుగుతోంది? వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారా? ఎంగేజ్‌మెంట్ కూడా జరిగిపోయిందా? వాటిపై హింట్ ఇచ్చేందుకే ఈ ఫోటోలను షేర్ చేశారా? అంటూ చిత్ర పరిశ్రమలో చర్చ నడుస్తోంది. అయితే మరో వెర్షన్ ప్రకారం నిహారిక ఎన్ఎం- రాఘవ్ జుయాల్‌లు హిందీలో భాయ్ తేరా స్టార్ హై మూవీలో జంటగా నటిస్తున్నారు. వివేక్ అగర్వాల్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వీరిద్దరూ ఫోటోలు షేర్ చేశారా? లేక నిజంగానే నిహారిక- రాఘవ్‌లు ప్రేమించుకుంటున్నారా అనేది తెలియాల్సి ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X