బేస్ లెస్ బ్యాన్ పై నష్టపరిహారం చెల్లించమంటున్న నిఖిత...?!
ఆ మధ్య నిఖిత కన్నడ హీరో దర్శన్ తో ఎఫైర్ నడుపుతుందని...దాని వల్ల దర్శన్ కి, అతని భార్యకి మధ్య గొడవలు జరిగి ఇద్దరూ విడిపోయారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. హీరో సంసారంలో చిచ్చు రేపిందంటూ, హీరోయిన్ నిఖితను ఇటీవల కన్నడ చిత్ర నిర్మాతల సంఘం నిషేధించి, తర్వాత విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం కావడంతో నిషేధాన్ని ఎత్తేసిన సంగతి మనకు తెలిసిన విషయమే...అసలే సినిమాలు లేక చిన్నా చితక సినిమాలు చేసుకుంటున్న నిఖిత..ఈ వార్తలతో ఇటు కర్ణాటక, అటు ఆంధ్ర రాష్ట్రాలలో బాగా పబ్లిసిటి సంపాదించుకొన్నది. ఆ పబ్లిసిటీ కారణంగానే ఆమె నిర్మాతల మండలిపై 10కోట్ల నష్ట పరిహారం చెల్లించాలంటూ పరువు నష్టం దావా వేస్తానంటూ పేచి పెట్టింది.
అయితే, తనపై ఎటువంటి ఆధారాలు లేకుండా నిషేధాన్ని విధించి, నిర్మాతల సంఘం తనను మానసిక క్షోభకు గురిచేసిందనీ, అందుకు నష్టపరిహారం చెల్లించాల్సిందిగా కోర్టుకు వెళతానని నిఖిత చెబుతోంది. ఈ విషయంపై ఆమె తన లాయర్లతో సంప్రదిస్తోందట కూడా. ఈ విషయం తెలుసుకున్న నిర్మాతల సంఘం వెంటనే సమావేశమై, చర్చించుకుని నిఖితకు మూడు కోట్ల వరకు నష్టపరిహారం ఇవ్వడానికి ముందుకొచ్చినట్టు తెలుస్తోంది. ఆమెతో నిర్మాతలు రాయబారం నడుపుతున్నట్టు కన్నడ చిత్రరంగంలో చెప్పుకుంటున్నారు. తమ తొందరపాటుతనానికి నిర్మాతలు ఇంతటి మూల్యాన్ని చెల్లించాల్సి వస్తోందన్న మాట.


Click it and Unblock the Notifications











