కాంచన 4 మూవీలో హాట్ బ్యూటీ.. లారెన్స్ కన్నేసిన అందాల భామ ఎవరో తెలుసా?

ఎప్పటి నుంచో నార్త్ సినిమా నుంచి తెలుగు సహా దక్షిణాది సినిమాకి ఎప్పటికపుడు కొత్త కొత్త హీరోయిన్స్ వస్తుంటారని అందరికీ తెలిసిందే. కాగా ఈ హీరోయిన్స్ ధాటి ఇప్పుడు మరింత ఎక్కువ అవుతూ మన దగ్గర సెటిల్ కూడా అయ్యిపోతున్నారు. కాగా అలా రీసెంట్ గానే దేవర సినిమాతో సెన్సేషన్ గా మారిన హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ కి హిందీ సినిమాలో దక్కని హిట్ అండ్ వెల్కమ్ మన తెలుగు సినిమా నుంచి దక్కింది.

అలాగే మరో బ్యూటీ మృణాల్ ఠాకూర్ ది కూడా దాదాపు ఇదే పరిస్థితి. అక్కడ ఆమె ప్లాప్ ఐతే తెలుగులో సూపర్ హిట్ అయ్యింది. ఇలా నార్త్ నుంచి వచ్చి సౌత్ లో సెటిల్ కాగా ఇపుడు వీరితో పాటుగా సౌత్ లో మరో హాట్ బ్యూటీ పాగా వేసేలా కనిపిస్తుంది అని చెప్పాలి. కాగా ఆమె ఎవరో కూడా కాదు తన అందాలతో హీట్ రైజ్ చేసే బ్యూటీ నోరా ఫతేహి అట. కాగా నోరాకి నార్త్ లో మంచి క్రేజ్ ఉంది. అలాగే తనపై పాటలకి కూడా సెన్సేషనల్ రెస్పాన్స్ ఉంది.

Is Nora Fatehi to play Crucial Role in Raghava Lawrence s Kanchana 4

కాగా ఆమె నటిగా తెలుగులో ఆల్రెడీ మెగా యంగ్ హీరో వరుణ్ తేజ్ నటించిన "మట్కా" లో స్పెషల్ సాంగ్ మాత్రమే కాకుండా రోల్ కూడా చేసి డెబ్యూ ఇచ్చింది. అయితే ఈ చిత్రం భారీ డిజాస్టర్ గా నిలిచిపోయింది. కాగా ఈ సినిమా తర్వాత మళ్ళీ సౌత్ లో ఓ క్రేజీ ఆఫర్ ని ఈమె పట్టేసినట్టుగా రూమర్స్ వస్తున్నాయి. అది కూడా తెలుగు ఆడియెన్స్ లో పెద్ద హిట్టయినటువంటి క్రేజీ హారర్ ఫ్రాంచైజ్ నాలుగో సినిమాలో ఈమె కనిపిస్తుంది అని వినిపిస్తుంది.

కాగా ఆ హారర్ సినిమా సీక్వెల్ ఏదో కూడా కాదు రాఘవ లారెన్స్ తెరకెక్కించే సినిమాలు "కాంచన 4" కోసం అట. కాగా కాంచన 4 కోసం చాలా మంది ఎప్ప్పుడు నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమాలోనే ఈమె కనిపించనున్నట్టుగా రూమర్స్ మొదలయ్యాయి. కాగా ఈ సినిమాలో మరో బ్యూటీ పూజా హెగ్డే కూడా కనిపించనుంది అని తెలిసిందే. దీనితో ఈ ఇద్దరితో లారెన్స్ రొమాన్స్ చేయనున్నాడని చెప్పవచ్చు.

Is Nora Fatehi to play Crucial Role in Raghava Lawrence s Kanchana 4

మరి ఈ సినిమాలో నోరా ఫతేహి ఎలాంటి రోల్ లో కనిపిస్తుంది, ఎలా మురిపిస్తుందో చూడాల్సిందే. కాగా ఈ సినిమాని లారెన్స్ మరింత గ్రాండ్ గా భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇవి పక్కన పెడితే లారెన్స్ ఇపుడు తమిళ్ సినిమాల్లో మాత్రమే కాకుండా తెలుగులో కూడా సినిమాలు చేస్తున్నారు. వీటిలో టాలీవుడ్ దర్శకుడు రమేష్ వర్మతో ఓ సూపర్ హీరో లాంటి సినిమాని తాను చేస్తుండగా దీనిపై మంచి అంచనాలు నెలకొన్నాయి. కాగా ఇవి అయ్యాక కాంచన 4 ని లారెన్స్ స్టార్ట్ చేయనున్నారని తెలుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X