భార్యతో విడాకుల దిశగా హృతిక్ రోషన్?
హైదరాబాద్: బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఆయన భార్య సుస్సానె మధ్య విబేధలు వచ్చాయా? గత కొంతకాలంగా వీరి వైవాహిక జీవితం సాఫీగా సాగడం లేదా? వీరి కాపురంలో చెలరేగిన అలజడి చిలికి చిలికి ఇద్దరూ విడాకులు తీసుకునే దిశగా సాగుతోందా?...బాలీవుడ్లో వినిపిస్తున్న పుకార్లు వింటే ఇది నిజమేమో అనే అనుమానం రాక తప్పదు.
కొన్ని రోజుల క్రితం హృతిక్ రోషన్ తండ్రి రాకేష్ రోషన్ పుట్టినరోజు వేడుక గ్రాండ్‌గా జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో జరిగిన ఓ సంఘటన వీరి మధ్య విభేదాలు ఉన్నయనే వార్తలకు కారణమైంది. ఈ వేడుకకు సుస్సేనె లేటుగా రావడంతో పాటు వెంటనే వెళ్లి పోయిందట. తన తల్లిదండ్రులకు సరైన మర్యాద దక్కక పోవడం వల్లనే ఆమె ఇలా చేసిందట.
జాతీయ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం సుస్సానె ఇప్పుడు తన భర్తతో కలిసి ఉండటం లేదని, తన తల్లిదండ్రుల వద్దే ఉంటోందని తెలుస్తోంది. ఆమె ఇద్దరు కుమారులు హ్రెహాన్, హృదాన తండ్రి హృతిక్ రోషన్‌తో కలిసి ఉంటున్నారట. ఇద్దరు పిల్లలను తమ తల్లిని గ్రాండ్ ఫాందర్ ఇంటికి వెళ్లి కలుస్తున్నారని, సుస్సానె మాత్రం రోషన్ ఇంటి గడప తొక్కడం లేదని ప్రచారం సాగుతోంది.

హృతిక్ రోషన్-సుస్సానె
హృతిక్ రోషన్, సుస్సానె వివాహం 21 డిసెంబర్, 2000 సంవత్సరంలో జరిగింది.

రోషన్ పిల్లలు
హృతిక్ రోషన్, సుస్సానె దంపతులకు ఇద్దరు పిల్లలు. పెద్ద కుమారుడు హ్రెహాన్ 2006లో జన్మించాడు. చిన్న కుమారుడు హృదాన్ 2008లో జన్మించాడు.

హాట్ కపుల్
హృతిక్, సుస్సానెలది ప్రేమ వివాహం. బాలీవుడ్ హాటెస్ట్ కపుల్స్ వీరు ఖ్యాతి గాంచారు.

భర్తతో కలిసి..
సుస్సానె రోషన్‌కు సినిమాలతో సంబంధం లేక పోయినా.....భర్తతో కలిసి పలు సినిమా కార్యక్రమాలతో పాటు, ప్రైవేటు కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటుంది.

విబేధాలు
ప్రస్తుతం వీరి మధ్య విబేధాలు తీవ్ర స్థాయిలో ఉన్నాయని....ఇద్దరు విడాకులు తీసుకునే ఆలోచనలో ఉన్నారని బాలీవుడ్లో ప్రచారం సాగుతోంది.


Click it and Unblock the Notifications











