ఎన్టీఆర్ ప్యూచర్ బ్యాంకాక్ లోనే...!?
జూ.ఎన్టీఆర్ భవిష్యత్ లో ఎక్కువ రోజులు బ్యాంకాక్ లో గడపే అవకాశముందంటున్నారు పరిశీలకులు.దానికి కారణం ఎన్టీఆర్ చేయబోయే వరస చిత్రాలు. అందులో ఊసరవిల్లి చిత్రం బ్యాంరోకాక్ లో ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటూంటే, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందే చిత్రంలో కొన్ని కీలకమైన సీన్స్ ను బ్యాంకాక్ లో తీయటానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. అలాగే శ్రీను వైట్ద దర్శకత్వంలో రూపొందబోయే చిత్రంకి చెందిన కథలోనూ బ్యాంకాక్ కొంత కామిడీ ని ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఇక పూరీ జగన్నాధ్ తో చేసే చిత్రం అంటే గ్యారెంటీగా బ్యాంకాక్ తప్పదనే విషయం తెలిసిందే. దాంతో ఎన్టీఆర్ భవిష్యత్ లో ఎక్కువ రోజులు బ్యాంకాక్ లో గడపక తప్పదంటున్నారు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ..ఊసరవిల్లి షూటింగ్ లో బిజీగా ఉన్నారు.
రంగులు మారే ఊసరవిల్లి కాదు..రాతలు మార్చే ఊసరవిల్లి, అలాగే కొడితే రంగులే కాదు రాతలు కూడా మారతాయి అంటూ డైలాగులు పంచ్ తో వస్తాయని తెలుస్తోంది.ఇక ఈ చిత్రం లో తమన్నా హీరోయిన్ గా చేస్తోంది.ఆమె మతిపోగొట్టుకుని ఏదీ గుర్తు ఉండని పాత్రలో కనిపించనుంది.ఇక ఆమె కోసం ఆమె పగ తీర్చటం కోసం ఎన్టీఆర్ చేసే పోరాటమే ఊసరివిల్లి అంటున్నారు.ఇక బోయపాటి సినిమాను ప్రక్కన పెట్టి మరీ రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నారు.ప్రస్తుతం ఊసరివిల్లి చిత్రం బ్యాంకాక్ లో షూటింగ్ జరుపుకుంటోంది.తమన్నా హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా మలుస్తున్నారు. అక్టోబర్ 6న విజయదశమి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్.ఆర్. ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు.
ఎన్టీఆర్ సరసన తమన్నా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాశ్‌రాజ్, కిక్ శ్యామ్, తనికెళ్ల భరణి, ఆద్విక్ మహాజన్, మురళీశర్మ, ఆహుతి ప్రసాద్, రెహమాన్, జయప్రకాశ్‌రెడ్డి, రఘుబాబు, అజయ్, ఎమ్మెస్ నారాయణ, పాయల్ ఘోష్, దువ్వాసి మోహన్, రఘు కారుమంచి, జీవీ, విద్యుత్ జమ్వాల్, బెనర్జీ తారాగణమైన ఈ చిత్రానికి కథ: వక్కంతం వంశీ, మాటలు: కొరటాల శివ, పాటలు: రామజోగయ్యశాస్త్రి, అనంత శ్రీరామ్, చంద్రబోస్, సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్, యాక్షన్: రామ్-లక్ష్మణ్, కళ: రవీందర్, లైన్ ప్రొడ్యూసర్: చక్రవర్తి రామచంద్ర, సమర్పణ: బి. బాపినీడు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సురేందర్ రెడ్డి.


Click it and Unblock the Notifications











