త్రిషను ఇన్సల్ట్ చేసిన జూ ఎన్టీఆర్
వేషాలు లేక ఖాలీ పడ్డ త్రిష అవకాశం కోసం ఎన్టీఆర్ ని సంప్రదిస్తే..ఆమె వయస్సును గుర్తు చేస్తూ.. ప్రస్తుతం తన ప్రక్కన కష్టమని,తన బాబాయ్ బాలకృష్ణ ప్రక్కన చేయటానికి రికమెండ్ చేస్తానని చెప్పాడట.దాంతో త్రిషకు ఎక్కడో కాలిందిట. ఈ విషయం ఇప్పుడు ఫిల్మ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆమె వెంకటేష్ సరసన బాడీగార్డ్ రీమేక్ లో చేస్తోంది. అలాగే బాడీగార్డు నిర్మాత బెల్లంకొండ సురేష్ ఆమె నటించిన తమిళ చిత్రం మంగత్తా రైట్స్ ని ఫాన్సీ రైట్స్ కు కొనుగోలు చేసారు బెల్లంకొండ. సెప్టెంబర్ 9వ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నాడు.
ఇక మొన్న బుధవారం భారీ ఓపెనింగ్స్ తో ఈ చిత్రం విడుదలైంది.ఇక కాంచన,కందిరీగ హిట్లతో స్పీడు మీదుయన్న బెల్లంకొండ ఈ సినిమా కూడా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు. ప్రేమలేఖ అజిత్ హీరోగా చేసిన ఈ చిత్రానికి యవన్ శంకర్ రాజా సంగీతం అందించారు. వైభవ్ మరో కీలకమైన పాత్ర చేసిన ఈ చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. వీటితో పాటు ఆమె బాలకృష్ణ, బి గోపాల్ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న చిత్రం కోసం కూడా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ చిత్రం టైటిల్ హరహర మహాదేవ. వీటితో పాటు విశాల్ సినిమాను కూడా ఓకే చేసింది. ఇక త్రిష హఠాత్తుగా విశాల్ ప్రాజెక్టుని ఎందుకు ఓకే చేసింది అంటే..దర్శకుడు తిరు చెప్పిన కథ నచ్చింది అంటోంది. ఆ కథ విని ధ్రిల్లయ్యానని అంటోంది. అలాగే బాలకృష్ణ సినిమాలో కూడా ఆమె చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











