ఎన్టీఆర్‌ వెరీ సీరియస్.. కుమిలిపోతున్న కమెడియన్‌‌.. ఇబ్బందిలో త్రివిక్రమ్‌!

By Rajababu

Recommended Video

Ntr Is Avoiding Comedian Srinivas Reddy

సినిమా పరిశ్రమలో గాసిప్స్‌కు ఉన్న డిమాండ్, క్రేజ్ మరే రంగంలో ఉండదు. రూమర్లు ఎలా, ఎక్కడ నుంచి పుడుతాయో కూడా అర్థం కాని పరిస్థితి ఒక్కోసారి ఏర్పడుతుంది. ఈ ఉపోద్ఘాతం ఇదంతా ఎందుకంటే.. అజ్ఞాతవాసి చిత్రం కొట్టిన దెబ్బకు కసితో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో త్రివిక్రమ్‌తో అరవింద సమేత.. వీరరాఘవ అనే చిత్రాన్ని తీస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల ఎన్టీఆర్ జన్మదినం రోజున విడుదలైన మోషన్ పోస్టర్‌తో ఈ సినిమాకు మంచి క్రేజ్ ఏర్పడింది. అయితే ఈ సినిమాకు సంబంధించిన ఓ గాసిప్‌ గత రెండు రోజులుగా మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్నది. అదేమిటంటే..

ఎన్టీఆర్‌తో మంచి రిలేషన్

ఎన్టీఆర్‌తో మంచి రిలేషన్

గతంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు కమెడియన్ శ్రీనివాస్‌రెడ్డికి మంచి స్నేహం ఉండేది. అప్పుడెప్పుడో సమైక్యాంధ్రలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం ఎన్టీఆర్ ఊరురా తిరిగివచ్చారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌కు సన్నిహితులుగా ఉన్న రాజీవ్ కనకాల, శ్రీనివాస్ రెడ్డి చేదోడు వాదోడుగా సహాయం అందించారు. చివరిగా ఖమ్మంలో బహిరంగ సభలో పాల్గొని హైదరాబాద్‌కు వస్తుండగా తారక్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే.

యాక్సిడెంట్‌తో దూరం

యాక్సిడెంట్‌తో దూరం

ఎన్టీఆర్ రోడ్డు ప్రమాదంలో గాయపడటానికి కారణం శ్రీనివాసరెడ్డి అని మీడియాలో ప్రచారమైంది. ఆ కారణంతో ఆగ్రహించిన యంగ్ టైగర్.. అప్పటి నుంచి శ్రీనివాస్‌రెడ్డిని దూరంగా ఉంచుతున్నారనేది అందరికి తెలిసిందే. ఈ మధ్యకాలంలో ఓ యూట్యూబ్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆ వివాదం గురించి స్వయంగా శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు కూడా. అప్పటి నుంచి ఎన్టీఆర్‌కు దూరంగా ఉండటమే కాకుండా ఆయన సినిమాల్లో శ్రీనివాస్‌రెడ్డి కనిపించలేదు.

ఎన్టీఆర్ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డి

ఎన్టీఆర్ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డి

ఇదిలా ఉండగా, దర్శకుడు త్రివిక్రమ్‌కు శ్రీనివాస్‌రెడ్డి సన్నిహితుడు. ఇటీవల కాలంలో ఈ కమెడియన్‌ను మాటల మాంత్రికుడు తన సినిమాల్లో మంచిగా ఎంకరేజ్ చేస్తున్నారు. అ.. ఆ.. చిత్రంలో శ్రీనివాస్‌రెడ్డి పాత్రకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు అదే చనువుతో ఎన్టీఆర్ సినిమాలో శ్రీనివాస్‌రెడ్డికి కీలకపాత్ర ఇచ్చారట. ఎన్టీఆర్ వద్దనలేక ఓకే అన్నారట. అక్కడే వచ్చింది చిక్కంతా.

కమెడియన్‌కు దూరంగా ఎన్టీఆర్

కమెడియన్‌కు దూరంగా ఎన్టీఆర్

కాంబినేషన్ సీన్లలో జూనియర్ ఎన్టీఆర్‌, శ్రీనివాస్‌రెడ్డి ఎడమొఖం, పెడమొఖంగా ఉంటున్నారట. త్రివిక్రమ్‌కు వీరి వ్యవహారం తలనొప్పిగా మారిందట. శ్రీనివాస్‌రెడ్డి షూటింగ్‌కు రాగానే జూనియర్ సైలెంట్‌గా ఉంటున్నారట. శ్రీనుతో సీన్లు పూర్తికాగానే దూరంగా వెళ్లిపోతున్నారట. ఇతర సాంకేతిక నిపుణులు, నటీనటులతో మాట్లాడుతూ కూర్చుంటున్నారట.

కుమిలిపోతున్న కమెడియన్

కుమిలిపోతున్న కమెడియన్

ఎన్టీఆర్ తనకు దూరంగా ఉండటాన్ని చూసి శ్రీనివాస్‌రెడ్డి కుమిలిపోతున్నాడట. సీన్ వచ్చేంత వరకు తన వ్యానిటీ వ్యాన్‌లో కూర్చొంటున్నాడట. ఎంత తర్వగా కాంబినేషన్ సీన్లు అయిపోతే బాగుండనే మూడ్‌లో శ్రీనివాస్‌రెడ్డి ఉంటున్నాడంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతున్నది.

ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి కాదు

ఎన్టీఆర్ అలాంటి వ్యక్తి కాదు

అయితే ఎన్టీఆర్ సన్నిహితులు మాత్రం ఈ రూమర్‌ను మాత్రం కొట్టిపడేస్తున్నారు. తారక్ చాలా ప్రొఫెషనల్‌గా వ్యవహరిస్తారు. ఎవరైనా సరే చాలా హుందాగా ప్రవర్తిస్తారు అనే చెప్పుకొంటున్నారు. షూటింగ్‌లో జరుగుతున్న ఈ వ్యవహారమంతా ఎలాగోలా బయటకు పొక్కింది. అయితే ఇందులో వాస్తవం ఎంత ఉందో గానీ.. రూమర్లు మాత్రం జోరుగానే ఊరేగుతున్నాయి. ఇలాంటి వాటికి ఎవరైనా ముందుకొచ్చి వివరణ ఇస్తే గాసిప్స్ అడ్డుకట్ట పడే అవకాశం ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X