twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎన్టీఆర్ బయోపిక్.. రేపే సెన్సార్ కార్యక్రమాలు!

    |

    తెలుగు జాతి ఖ్యాతిని నలుదిశలా వ్యాప్తి చేసిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ రిలీజ్‌కు సిద్దమైంది. ఈ చిత్రం తొలిభాగంగా ఎన్టీఆర్ కథానాయకుడు జనవరి 9న విడుదలకు ముస్తాబైంది. ఎన్టీఆర్‌గా నందమూరి బాలకృష్ణ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది.

    రేపే సెన్సార్

    రేపే సెన్సార్

    ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం రేపు సెన్సార్ కార్యక్రమాలు జరుపుకోనుంది. విడుదలకు అన్ని సన్నాహకాలు జరుగుతున్నాయి. నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం మొత్తం స్టార్స్ తో నిండిపోతుంది. ఈ చిత్రాల్లో చాలామంది ప్రముఖ నటీనటులు కనిపించబోతున్నారు. తన తండ్రి ఎన్టీఆర్ పాత్రలో బాలయ్య నటిస్తున్న సంగతి తెలిసిందే.

    పాయల్ రాజ్‌పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!పాయల్ రాజ్‌పుత్, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్‌లో ఉత్తమ విలన్ ఎవరు.. ఓటేసి మీరే డిసైడ్ చేయండి!

    రెండు భాగాలుగా

    రెండు భాగాలుగా

    బాలయ్య తన తండ్రి పాత్రలో నటిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడుగా రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. క్రిష్ దర్శత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. రానా, సుమంత్, రకుల్ ప్రీత్ సింగ్, నిత్యామీనన్ వివిధ ప్రముఖల పాత్రలో మెరవబోతున్నారు. విద్యాబాలన్ ఎన్టీఆర్ సతీమణి బసవతారకం పాత్రలో నటిస్తోంది. ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రాన్ని జనవరి 9న విడుదుల చేయనున్నారు.

    రాఘవేంద్ర రావు పాత్రలో

    రాఘవేంద్ర రావు పాత్రలో

    ఈ చిత్రంలో మొత్తం 9 మంది హీరోయిన్లు వివిధరకాల పాత్రల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు పాత్రలో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఏఎన్నార్ పాత్రలో సుమంత్, హరికృష్ణ పాత్రలో కళ్యాణ్ రామ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు పాత్ర కూడా ఈ చిత్రంలో ఉన్నట్లు తెలుస్తోంది. రాఘవేంద్ర రావు పాత్రలో ఆయన తనయుడు ప్రకాష్ నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

    సూపర్ హిట్ చిత్రాలు

    సూపర్ హిట్ చిత్రాలు

    రాఘవేంద్ర రావు, ఎన్టీఆర్ కాంబినేషన్ లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు వచ్చాయి. అడవి రాముడు చిత్రం అప్పట్లో సంచలన విజయం సాధించింది. మేజర్ చంద్రకాంత్, వేటగాడు, కొండవీటి సింహం లాంటి చిత్రాలు మంచి విజయం సాధించాయి. ఈ చిత్రాలతో రాఘవేంద్ర రావు టాలీవుడ్ లో టాప్ డైరెక్టర్‌గా మారారు.

    English summary
    NTR Biopic based on the life of legendary actor-politician Nandamuri Taraka Rama Rao, will hit the theatres on January 9 worldwide. Censor board officials have asked the members of NTR family to issue a NOC and it is said that the actor's second wife Lakshmi Parvathi might not agree to it.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X