ఎన్టీఆర్ ఆస్తి తెలిస్తే షాకే.. దేశ సంపన్నుల టాప్ లిస్టులో యంగ్ టైగర్?
టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఏ హీరోకు రానన్ని హిట్స్ జూనియర్ జాబితాలో చేరాయి. తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. అయితేతాజాగా దే
Recommended Video

టాలీవుడ్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ వరుస విజయాలతో దూసుకెళ్తున్నారు. ఇటీవల ఏ హీరోకు రానన్ని హిట్స్ జూనియర్ జాబితాలో చేరాయి. టెంపర్ చిత్రంతో మొదలు పెట్టిన జైత్రయాత్ర నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ నుంచి మొన్న విడుదలైన జై లవకుశ వరకు సాగింది.
అంతేకాకుండా తెలుగు బిగ్‌బాస్ రియాలిటీ షోతో దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే తాజాగా దేశంలోనే కాకుండా టాలీవుడ్‌లోని టాప్ 10 సంపన్నుల జాబితాలో ఎన్టీఆర్ చేరిపోయాడనే వార్త మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతున్నది. అయితే ఈ వార్తకు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రూమర్ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది.

జూ. ఎన్టీఆర్ ఆస్తులు 1600 కోట్లా?
ఇటీవల మీడియాలో ప్రచారం అవుతున్న వార్త ప్రకారం.. ఎన్టీఆర్ ఆస్తి ఏకంగా 1600 కోట్లు అని చెప్పుకొంటున్నారు. దీంతో ఆయన టాలీవుడ్‌లోని సంపన్నుల జాబితాలో చేరిపోయారు అని ఆ వార్త సారాంశం.

తారక్ ఆస్తుల వివరాలు
జూనియర్ ఎన్టీఆర్‌కు వచ్చిన ఆస్తుల వివరాలు ఇలా ఉన్నాయి. తాత ఎన్టీఆర్ నుంచి వారసత్వంగా తండ్రి నుంచి వచ్చిన ఆస్తి రూ.450 కోట్లు అని ఓ కథనంలో వెల్లడించారు.

మామ నుంచి భారీగా
జూనియర్ ఎన్టీఆర్ సతీమణి ప్రణతి ప్రముఖ వ్యాపారవేత్త, నార్నే ఎస్టేట్స్, స్టూడియో ఎన్ అధినేత నార్నే శ్రీనివాసరావు కుమార్తె. తన మామ నుంచి 300 కోట్ల ఆస్తి వచ్చినట్టు చెప్తున్నారు.

ఏపీ, తెలంగాణలో భారీగా
ఇక మహాబలిపురం, ఫిలింనగర్, హైదరాబాద్, ఏపీలోని విజయవాడ, వైజాగ్ తదితర ప్రాంతాల్లో భారీగా ఆస్తులు ఉన్నాయట. అంతేకాకుండా ఎన్టీఆర్ భార్య పేరిట కూడా భారీ మొత్తంలోనే ఆస్తులు ఉన్నట్టు సమాచారమట.

అతి సంపన్నుల జాబితాలో
ఇలా ఆస్తులన్నీ కూడగడితే మొత్తం 1600 కోట్లు ఉన్నట్టు సమాచారం. దీంతో దేశంలోనే అతి సంపన్నుల జాబితాలో ఎన్టీఆర్‌కు చోటుదక్కినట్టు తెలుస్తున్నది. అంతేకాకుండా టాలీవుడ్ ప్రముఖుల్లో కూడా సంపన్నుడిగా చేరినట్టు వార్తలు వెలువడుతున్నాయి.

ఆస్తుల వివరాలు నిజామా? అబద్దమా
అయితే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఆస్తుల వివరాలు నిజామా? అబద్దమా అనే విషయంపై చర్చ జరుగుతున్నది. అయితే ప్రముఖులు ఆస్తుల వివరాలు చాలా గోప్యంగా ఉంటాయనేది అందరికీ తెలిసిందే. తారక్ ఆస్తుల వివరాలు ఎక్కడ నుంచి వచ్చాయో అనేదానికి ఆధారం లేదు. కనుక ఈ వివరాలు నమ్మాలా వద్దా అనే విషయంపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.


Click it and Unblock the Notifications











