Devara దేవర అవుట్.. దేవరకొండ ఇన్.. ఎన్టీఆర్ మూవీ వాయిదాకు కారణం అదేనట!

తెలుగు సినిమా పరిశ్రమలో పలు నిర్మాతలు తమ సినిమాలను రిలీజ్ చేసేందుకు పోటీ పడుతున్నారు. భారీ బడ్జెట్, మీడియం రేంజ్ సినిమాలు అనువైన రిలీజ్ డేట్ల కోసం ప్రయత్నిస్తున్నారు. అయితే ఈగిల్ సినిమా రిలీజ్ వివాదం పక్కన పెడితే.. ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్న దేవర లాంటి మూవీస్ రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉండగా, అదే సమయంలో మరికొన్ని చిత్రాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

ఆచార్య డిజాస్టర్ తర్వాత దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. భారీ బడ్జెట్, అత్యధికంగా వీఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్‌తో సినిమా రూపొందుతున్నది. ఇటీవల రిలీజ్ చేసిన గ్లింప్స్‌కు భారీ రెస్పాన్స్ లభించింది. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్‌పై రకరకాల ఊహగానాలు వినిపిస్తున్నాయి.

ఇక దేవర యాక్షన్ సీన్స్ షూటింగ్ సమయంలో బాలీవుడ్ నటుడు సైఫ్ ఆలీ ఖాన్ చేతికి గాయం కావడంతో కొంత ఇబ్బందిగా మారింది. ఇటీవలే సైఫ్ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. దాంతో ఈ మూవీ షూటింగ్ వాయిదా పడింది. అయితే ఈ అంశం సినిమా రిలీజ్ వాయిదా పడటానికి కారణం కాకపోయినా.. వీఎఫ్ఎక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని తెలుస్తున్నది.

Is NTRs Devara movie Release postponed? If so Vijay Deverakondas Family Star Release on April 5th

అయితే దేవర సినిమా విడుదల వాయిదా పడినట్టు వార్తలు వస్తున్నాయి. కానీ అధికారికంగా సినిమా యూనిట్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. దాంతో ఈ సినిమా ఏప్రిల్‌లో రిలీజ్ అవుతుందా? లేదా అనేది ప్రశ్నార్థకంగా మారింది.

ఇదిలా ఉండగా, దేవర రిలీజ్ వాయిదా పడితే.. అదే డేట్‌లో విజయ్ దేవరకొండ నటించిన ఫ్యామిలీ స్టార్ సినిమాను రిలీజ్ చేయాలని దిల్ రాజు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తున్నది. అయితే ఈ డేట్ మీద త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దాంతో సమ్మర్ రేసు నుంచి దేవర అవుట్.. దేవరకొండ ఇన్ అనే విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

Is NTRs Devara movie Release postponed? If so Vijay Deverakondas Family Star Release on April 5th

ఇక రవితేజ నటించిన ఈగిల్ సినిమా కోసం టిల్లు స్వ్కేర్ సినిమా ఫిబ్రవరి 9 తేదీన రిలీజ్ డేట్ వాయిదా వేసుకొన్నది. అయితే ఈ సినిమా కూడా దేవర రిలీజ్ వాయిదా పడితే మార్చి 30వ తేదీన టిల్లు స్వ్కేర్ సినిమాను నిర్మాత నాగవంశీ రిలీజ్ చేసే ప్రయత్నాలు చేపడుతున్నారు. దేవర రిలీజ్ వాయిదా పడితే.. మరికొన్ని సినిమాలు రిలీజ్‌కు సిద్దమవుతున్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X