నాని పారడైజ్‌లో చిరంజీవి ?.. ఓదెల శ్రీకాంత్ ప్లాన్ మామూలుగా లేదుగా!

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సినిమా 'ది పారడైజ్'. దసరా వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఆయన రెండోసారి జతకట్టడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న వార్తలు చూస్తే.. 'ది పారడైజ్' కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, ఒక పెద్ద సినిమాటిక్ యూనివర్స్‌కు శ్రీకారం కావచ్చని చర్చ జరుగుతోంది.

శ్రీకాంత్ ఓదెల ప్రస్తుతం నానితో 'పారడైజ్' తెరకెక్కిస్తుండగా, ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల కథలకు ఇంటర్ లింక్ ఉందనే ప్రచారం ఇప్పుడు సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. 'పారడైజ్'లో చూపించే కొన్ని పాత్రలు, సంఘటనలు చిరంజీవి సినిమాలో మరింత విస్తృతంగా కనిపించనున్నాయనే టాక్ వినిపిస్తోంది.

Is Paradise the Beginning of a New Universe Nani Chiranjeevi Films May Be Linked

ముఖ్యంగా 'పారడైజ్' క్లైమాక్స్‌లోనే చిరంజీవి సినిమాకు సంబంధించిన లీడ్ లేదా హింట్ ఉండే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీలో చర్చ జరుగుతోంది. హాలీవుడ్ మార్వెల్ తరహాలో ఒక సినిమా చివరలో మరో సినిమా కథకు లింక్ ఇవ్వడం ఇప్పుడు భారతీయ సినిమాల్లో కూడా ట్రెండ్ అవుతోంది. అదే ఫార్ములాను శ్రీకాంత్ ఓదెల కూడా అనుసరించే అవకాశముందని అంటున్నారు.

ఇక తాజాగా మరో ఆసక్తికర అంశం కూడా వెలుగులోకి వచ్చింది. 'పారడైజ్'లో పవర్‌ఫుల్ క్యామియో పాత్ర కోసం మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించారని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే 'పారడైజ్' క్లైమాక్స్‌లో చిరంజీవి ఎంట్రీతో ప్రేక్షకులకు భారీ సర్‌ప్రైజ్ లభించే అవకాశం ఉంది. అదే సమయంలో ఆయన తదుపరి సినిమాకు కూడా అది పునాది కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతేకాదు, 'పారడైజ్' కథకు ప్రీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారని మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంటే ప్రస్తుతం తెరకెక్కుతున్న సినిమా మధ్య భాగం కాగా, ముందు జరిగిన సంఘటనలను చూపించే ప్రీక్వెల్, ఆ తర్వాత కథను ముందుకు తీసుకెళ్లే చిరంజీవి సినిమా ఉండే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే శ్రీకాంత్ ఓదెల టాలీవుడ్‌లో కొత్త సినిమాటిక్ యూనివర్స్‌కు శ్రీకారం చుట్టిన దర్శకుడిగా నిలిచిపోతాడు.

అయితే ఈ విషయాలపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం ఇవన్నీ ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాలే. కానీ 'దసరా'తో తన కథ చెప్పే విధానాన్ని నిరూపించుకున్న శ్రీకాంత్ ఓదెల నుంచి ఏదో ప్రత్యేకమైనది రాబోతోందనే నమ్మకం అభిమానుల్లో ఉంది. ఒకవేళ 'పారడైజ్', చిరంజీవి సినిమా, ప్రీక్వెల్ అన్నీ ఒకే సినిమాటిక్ ప్రపంచానికి చెందినవిగా తేలితే.. టాలీవుడ్‌లో మరో భారీ సినిమాటిక్ యూనివర్స్ ఆవిర్భవించినట్లే.

Read more about: srikanth odela nani chiranjeevi
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X