సమంతను బయిటకు పంపింది పవన్ కళ్యాణ్ ?
హైదరాబాద్ : 'ఎవడు' సినిమా నుంచి నేను తప్పుకున్నట్లు వచ్చిన వార్త నిజమే, నేను ఆ సినిమాలో లేను, కానీ ఈ సారి డేట్స్ ప్రాబ్లం వల్ల మాత్రం కాదు... ఇది ఒక క్రియేటివ్ వ్యక్తి నిర్ణయం, నన్ను సినిమా నుంచి బయటకు పంపించిన అతనికి లక్కు కలిసి రావాలని విష్ చేయండి' అంటూ రీసెంట్ గా సమంత ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఆమె చెప్పింది పవన్ కళ్యాణ్ గురించి అంటూ ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్ లో ,వెబ్ మీడియాలో ప్రచారం అవుతోంది. అయితే ఇది కావాలని కొందరు పనిగట్టుకుని చేస్తున్న ప్రచారమే అని ఓ వర్గం అంటోంది.
పవన్ కళ్యాణ్ అని చెప్పటానికి కారణం వారు చెప్పేదేమిటంటే..ఆమె...తను,త్రివిక్రమ్ తో చేస్తున్న చిత్రంలో చేస్తానని కమిటవ్వమే అంటున్నారు. తన చిత్రం,ఎవడు చిత్రం ఒకే సారి విడుదల అవుతుంది కాబట్టి,రెండింటిలోనూ ఒకరే హీరోయిన్ గా ఉండటం పద్దతి కాదని ఆమెని వద్దని తప్పించారని అంటున్నారు. అయితే ఈ వాదన పూర్తిగా అసంబద్దం లాగానే కనపడుతోంది. అంతగా ఒకేసారి తమ సినిమాలు విడుదల అవుతాయని పవన్ భావించి,సమస్య ఎదురవుతుందనుకుంటే ..తన చిత్రంలో హీరోయిన్ గా వద్దనుకుంటాడు కానీ ఇలాంటి పనులు చేయడనేది ఆయన ఉన్నతమైన వ్యక్తిత్వం తెలిసిన వారు చెప్పేమాట.
ఇక ఈ రూమర్ కి తెరపడాలంటే....సమంత ... ఆ క్రియేటివ్ పర్సన్ ఎవరు...అనేది తానే స్వయంగా క్లియర్ చేస్తే బెస్ట్ . ఎందుకు తనను ఆ సినిమా నుంచి బయటకు పంపించారు అనే విషయం సమంత వెల్లడిస్తే గొడవ ఉండదు. ఏదైమైనా ఇలాంటి రూమర్స్ కి త్వరగా ఫుల్ స్టాఫ్ పెట్టాల్సిన అవసరం ఉంది. త్వరలోనే ఈ విషయం బయట పడే అవకాశం ఉంది.
'ఎవడు' చిత్రానికి వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. సమంత స్థానంలో శృతి హాసన్ ను ఎంపిక చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈచిత్రంలో రెండో హీరోయిన్ గా బ్రిటిష్ మోడల్ అమీ జాక్సన్ నటిస్తోంది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఈ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించనున్నాడు.


Click it and Unblock the Notifications











