బ్లాక్‌బస్టర్ రీమేక్‌ కోసం పవన్ కల్యాణ్, బాలకృష్ణ.. బాలీవుడ్ నిర్మాత రంగంలోకి..

టాలీవుడ్‌లో ప్రస్తుతం హాట్‌గా పవన్ కల్యాణ్ ఎంట్రీ గురించి చర్చ జరుగుతున్నది. అయితే తాజాగా పవర్ స్టార్ ఎంట్రీ గురించి ఊహగానాలు ఎక్కువయ్యాయి. అయితే పింక్ రీమేక్‌లో పవన్ కల్యాణ్ నటిస్తున్నారనే వార్త సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ వార్త ఇలా ప్రచారం అవుతుండగానే పింక్ రీమేక్‌లో మరో స్టార్ హీరో నటిస్తున్నారనే విషయం ఆ వార్తకు మరింత ఆజ్యం పోసింది. ఇంతకీ పింక్ రీమేక్‌ ఎవరు చూస్తున్నారు.. ఎవరీ పేర్లు పరిశీలనలో ఉన్నాయంటే..

తమిళ రీమేక్‌ తర్వాత

తమిళ రీమేక్‌ తర్వాత

అమితాబ్, తాప్సీ నటించిన పింక్ చిత్రం బాలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకొన్నది. తాజాగా ఆ చిత్రం తమిళంలో రీమేక్ అయి ఘన విజయం సొంతం చేసుకొన్నది. అజిత్, శ్రద్ధా శ్రీనాథ్‌కు మంచి ప్రశంసలు దక్కడమే కాకుండా భారీ వసూళ్లు నమోదయ్యాయి. తమిళ రీమేక్ అందించిన ఉత్సాహంతో తెలుగు రీమేక్‌పై దృష్టిపెట్టారు. అయితే ఈ క్రమంలో అనూహ్యంగా పవన్ కల్యాణ్, బాలకృష్ణ పేర్లు తెరపైకి వచ్చాయి.

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ

పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ

ఇటీవల జరిగిన ఏపీ ఎన్నికల ముందు జనసేన అధినేతగా పవన్ కల్యాణ్ సినిమాలకు స్వస్తి చెప్పి పూర్తిస్థాయిలో పార్టీ కోసం పనిచేసిన విషయం తెలిసిందే. ఎన్నికల తర్వాత తాజాగా పవన్ కల్యాణ్‌ను నిర్మాత ఏఎం రత్నం కలిసినట్టు వార్తలు వచ్చాయి. అయితే పవన్ కల్యాణ్ సినిమాల్లో నటిస్తాడా? అనే విషయంపై ఆయన పెదవి విప్పడం లేదు.

పరిశీలనలో బాలకృష్ణ పేరు

పరిశీలనలో బాలకృష్ణ పేరు

ఇక తాజాగా నిర్మాత బోని కపూర్ పింక్ చిత్రాన్ని తెలుగులో రూపొందించాలనే ప్రయత్నాల్లో ఉన్నట్టు సమాచారం. అయితే బాలకృష్ణ లేదా పవన్ కల్యాణ్‌‌ను ఒప్పించే పనిలో ఉన్నట్టు సమాచారం. ఒకవేళ అగ్ర నటులతో సినిమా చేస్తే భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. పింక్ రీమేక్‌పై త్వరలోనే క్లారిటీ రానున్నది.

సౌత్‌లో మరిన్నీ రీమేక్స్

సౌత్‌లో మరిన్నీ రీమేక్స్

ఇటీవల బాలీవుడ్ మీడియాతో బోని కపూర్ మాట్లాడుతూ.. దక్షిణాదిలో మరిన్నీ రీమేక్స్ తీయాలనే ప్లాన్ ఉంది. అందులో భాగంగానే పింక్ తొలి ప్రయత్నం. ఇంకా మరిన్నీ రీమేక్స్ రూపొందిస్తాను. బాదాయి హో అనే సినిమా రైట్స్ ఉన్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రూపొందిస్తాను అని అన్నారు.

ఇదిలా ఉండగా, బాలకృష్ణ ప్రస్తుతం తమిళ దర్శకుడు కేఎస్ రవికుమార్‌తో సినిమా చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతున్నది. బ్యాంకాక్ షెడ్యూల్ పూర్తి చేసుకొని రామోజీ ఫిలిం సిటీలో బాలకృష్ణపై సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X