సన్నిహితుల నుంచి ఒంటరిగా... పవన్ కళ్యాణ్?
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మీడియాకు, సినిమా ఫంక్షన్లకు, పబ్లిక్ ఫంక్షన్లకు మొదటి నుంచి దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యక్తిత్వమే అంత, ఆయనకు అలా ఉండటమే ఇష్టం కాబోలు అంటూ అంతా సరి పుచ్చుకున్నారు. అయితే పవన్ ఇప్పుడు వీటితో పాటు.. తన స్నేహితులు, ఫ్యామిలీకి కూడా దూరంగా ఒంటరిగా ఉంటున్నాడట పవర్ స్టార్.
ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం... ఆయన ఈ మధ్య కాలంలో ఎవరితోనూ కలవడం లేదని, స్నేహితులకు, కుటుంబ సభ్యులకు కూడా దూరంగానే ఉంటున్నారని తెలుస్తోంది. తన దృష్టంతా పూర్తిగా సినిమాలపైనే పెట్టాడని, ఇతర యాక్టివిటీస్ పై ఆయన పెద్దగా శ్రద్ధ చూపడం లేదని వాదన వినిపిస్తోంది.
పవన్ సోదరుడు, కేంద్ర మంత్రి అయిన మెగాస్టార్ చిరంజీవికి కూడా పవన్ పై ఇలాంటి అభిప్రాయంతోనే ఉన్నారని ఓ ప్రముఖ ఇంగ్లీష్ డైలా పేర్కొంది. మెగాస్టార్ చిరంజీవికి పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ ఫంక్షన్లలో తప్ప కలవడమే లేదట. పవన్ స్నేహితుల నుంచి కూడా ఇలాంటి ఫర్యాదే అందుతోంది.
అయితే కొందరు మాత్రం... అలాంటిదేమీ లేదని, ఆయన పూర్తిగా తన ప్రొఫెషన్ పైనే దృష్టి పెట్టారని, గబ్బర్ సింగ్ సినిమా నుంచే పవన్ చాలా బిజీ అయ్యారని... తన రాబోయే సినిమాలపైనే సీరియస్ గా దృష్టి సారించాడని, బహుషా అందువల్లే దూరంగా ఉంటున్నాడని అంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ దర్శకత్వంలో 'సరదా' (తాత్కాలిక టైటిల్) సినిమా చేస్తున్నారు. ఇటీవలే పూజా కార్యక్రమం జరుపుకున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్.


Click it and Unblock the Notifications