అన్నయ్యను ఆదుకొంటానంటున్న పవన్ కళ్యాణ్..
'మగధీర" సాందించిన గ్రాండ్ సక్సెస్ ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో భాస్కర్ డైరెక్షన్ లో నాగబాబు చేసిన 'ఆరెంజ్" అతన్ని నష్టాల్లోకి నెట్టింది. 20కోట్ల బడ్జెట్ అనుకుని సినిమా మొదలెడితే భాస్కర్ అసమర్థత వల్ల అది 35కోట్లకు పెరిగింది. అన్యయ్య బాధను అర్థం చేసుకున్న తమ్ముడు పవన్ కళ్యాణ్ అంజనా ప్రొడక్షన్స్ బేనర్ లో ఓ సినిమా చేస్తానని నాగబాబుకి చెప్పినట్టు తెలిసింది. అయితే ఆ సినిమా డైరెక్టర్ ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. రెమ్యునరేషన్ తీసుకోకుండా ఆ సినిమా చేస్తానని, ఆర్థికంగా కూడా సాయం చేస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.
ప్రస్తుతం జయంత్ డైరెక్షన్ లో గణేష్ బాబు నిర్మిస్తున్న లవ్లీ చిత్రం చేస్తున్న పవన్ ఆ సినిమా తర్వాత అంజనా ప్రొడక్షన్స్ బేనర్ లో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 'కొమరం పులి" తో ప్లాప్ కొట్టిన పవన్ కళ్యాణ్, 'ఆరెంజ్" తో నష్టాల పాలైన నాగబాబు ఇద్దరూ కలిసి చేయబోతున్న ఈ సినిమా ఇద్దరికీ లాభసాటిగా వుంటుందని ఉభయులూ భావిస్తున్నారు.


Click it and Unblock the Notifications











