OG మూవీ ఇంటర్వెల్ బ్యాంగ్.. మైండ్ బ్లోయింగ్ సీక్వెన్స్‌తో థియేటర్లు దద్దరిల్సాందేనట!
రానున్న రోజుల్లో తెలుగు సినిమా నుంచి విధ్వంసకర అంచనాలు ఉన్న భారీ సినిమాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సెన్సేషనల్ ప్రాజెక్ట్ కూడా ఉంది. కాగా ఇప్పుడు డెప్యూటీ సీఎం సాబ్ రెండు పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు. వీటిలో అంత రేంజ్ అంచనాలు ఉన్న సినిమా మాత్రం దర్శకుడు సుజిత్ తో చేస్తున్న ఒరిజినల్ గ్యాంగ్ స్టర్, ఓజాస్ గంభీర అలియాస్ "ఓజి" సినిమా అని చెప్పాలి.
కాగా దీనికి ముందు పవన్ నటించిన భారీ పాన్ ఇండియా సినిమా "హరిహర వీరమల్లు" పై ఎక్కువ అంచనాలు ఉండేవి కానీ ఎప్పుడైతే ఓజి సినిమా అనౌన్స్ అయ్యిందో అక్కడ నుంచి ఓజి రీచ్ పీక్స్ లోకి వెళ్ళింది. కాగా ఇప్పుడు దాదాపుగా పవన్ అభిమానులు అంతా ఓజి మ్యానియా లోనే నిమగ్నమయ్యారు.

అయితే ఓజి కోసమే అంత ఎగ్జైటింగ్ గా ఎందుకు ఉన్నారు అంటే దానికి కారణం లేకపోలేదు. పవన్ నుంచి స్ట్రెయిట్ సినిమా అనేది పెద్ద కారణం అయితే సుజిత్, అందులో గ్యాంగ్ స్టర్ పక్కా యాక్షన్ సినిమా ఇది కావడంతో ఆ అంచనాలు వేరే లెవెల్లో ఉన్నాయి.
ఇక అందుకు తగ్గట్టే ఈ సినిమాలో పలు మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలిసిందే. ఆల్రెడీ వచ్చిన గ్లింప్స్ కే మొత్తం తగలబడిపోయింది. అయితే లేటెస్ట్ గా ఓజి సినిమాలో ఓ మైండ్ బ్లాకింగ్ సీన్ కోసం టాక్ వినిపిస్తుంది. దీనితో సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ ని మన టాలీవుడ్ హిస్టరీ లోనే ఒక ఐకానిక్ ఇంటర్వెల్ బ్యాంగ్ లెవెల్లో అడ్రినలిన్ రష్ ఇచ్చే విధంగా డిజైన్ చేసినట్టుగా తెలుస్తుంది.

ఈ సీక్వెన్స్ అంతా రాత్రి పూట నడిచే భారీ ఛేజింగ్ సీన్ అన్నట్టు తెలుస్తుంది. కాగా పవన్ పై ఒక ఊహించని బైక్ ఛేజింగ్ సీన్ ని సుజిత్ అయితే డిజైన్ చేసాడట. ఇది ఊహలకు కూడా అందని విధంగా క్రేజీ టేకింగ్ తో ఉండబోతోందని తెలుస్తోంది. కాగా పవన్ ఈ షూటింగ్ లో ఈ కొన్ని రోజుల్లోనే జాయిన్ కానున్నారట.
అలాగే ఈ సీన్ లోనే బాలీవుడ్ నటుడు ఈ సినిమా విలన్ అయినటువంటి ఇమ్రాన్ హష్మీ కూడా కనిపించనున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ ఇంటర్వెల్ బ్యాంగ్ ఎపిసోడ్ లో పవన్ వర్సెస్ ఇమ్రాన్ సీన్స్ అదిరిపోతాయని చెప్పొచ్చు. కాగా ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే యంగ్ బ్యూటి ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇంకా అర్జున్ దాస్ తదితరులు నటిస్తున్న ఈ సినిమాని డివివి దానయ్య భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. అలాగే వచ్చే ఏడాది ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో రిలీజ్ కి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే దాదాపు ఈ సినిమా వచ్చే ఏడాది ద్వితీయార్థంలో వస్తుంది అన్నట్లుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











