'అత్తారింటికి దారేది'లో బ్రహ్మీ సీన్స్ హాలీవుడ్ కాపీనా?
హైదరాబాద్ : పవన్‌కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో రూపొందిన 'అత్తారింటికి దారేది' చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆల్‌టైమ్ రికార్డుల్ని సృష్టిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఈ చిత్రంలో బ్రహ్మానందం,పవన్ కళ్యాణ్ మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు. ఈ సీన్స్ లో పవన్ అల్లాపూర్ బాబాగా కెవ్వుకేక పాట పాడుతూ...బాదం చెట్టు ఆకులు రావటం చూపెడుతూ బ్రహ్మానందం తో ఆడుకుంటాడు. ఈ సన్నివేశాలు ఎడ్ మర్ఫీ నటించిన A Thousand Words (2012) చిత్రంలో యధాతథంగా ఉన్నాయి. ఈ విషయం సోషల్ నెట్ వర్కింగ్ సైట్స్ లో ఎక్కువగా ప్రచారం అవుతోంది.
తెలుగు సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈ చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తుంది. ఒక్క ఇండియాలోనే కాదు...ఓవర్సీస్ మార్కెట్లోనూ సినిమా కలెక్షన్లు రికార్డులు స్థాయిలో వస్తున్నాయి. త్వరలోనే ఈచిత్రం రూ. 100 కోట్ల మార్కును అందుకుంటుందని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫ్యామిలీ, యూత్, క్లాస్, మాస్ ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే విధంగా చిత్రం ఉండటం సినిమాకు బాగా ప్లస్సయింది.
పవన్ కళ్యాణ్ హీరోగా స్టార్ రైటర్, డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్ సమర్పణలో శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఇండియా ప్రై.లి.పతాకంపై భారీ చిత్రాల నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్'అత్తారింటికి దారేది' చిత్రాన్ని నిర్మించారు. పవన్ సరసన సమంత, ప్రణీత హీరోయిన్లుగా నటించారు. నదియా, కోట శ్రీనివాస్, అలీ, బ్రహ్మానందం, ఎంఎస్ నారాయణ తదితరులు నటించారు.
ఈచిత్రానికి సంగీతం : దేవిశ్రీ ప్రసాద్, ఫోటోగ్రఫీ : ప్రసాద్ మూరెళ్ల, ఫైట్స్ : పీటర్ హెయిన్స్, ఆర్ట్: రవీందర్, కో ప్రొడ్యూసర్స్ : భోగవల్లి బాపినీడు, రిలయన్స్ ఎంటర్టెన్మెంట్స్, నిర్మాత : బివిఎస్ఎన్ ప్రసాద్, రచన-దర్శకత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్.


Click it and Unblock the Notifications












