twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ద్రోహం చెయొద్దు.. కలుషితం ఉండొద్దు.. పవన్ టార్గెట్ శరత్ మారారేనా? అందుకే ఆ వ్యాఖ్యలు చేశారా?

    By Rajababu
    |

    సినిమా పరిశ్రమలో బంధాలు, సంబంధాలు చాలా తాత్కాలికమే అని చెబుతుంటారు. అతి సన్నిహితులు అనుకునేవారు బద్ధశత్రువులుగా, భిన్న ధృవాలుగా ఉన్నవారు సన్నిహితంగా కలిసిపోవడం చాలానే కనిపిస్తాయి. తాజాగా తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, నిర్మాత శరత్ మరార్ దోస్తి గురించి బాగా చర్చ జరుగుతున్నది. పవన్, శరత్ మరార్ మధ్య విభేదాలు నెలకొన్నాయనే విషయం కొన్నినెలలుగా మీడియాలో నానుతున్నది.

    శరత్ మారార్‌తో క్లోజ్ రిలేషన్స్

    శరత్ మారార్‌తో క్లోజ్ రిలేషన్స్

    పవన్ కల్యాణ్, శరత్ మరార్ మధ్య మంచి స్నేహబంధం ఉండేదనే వాస్తవం. వారిద్దరు కాంబినేషన్‌లో చాలా చిత్రాలే వచ్చాయి. ఆఫ్ స్క్రీన్‌లో వారి బంధం బలమైనదని సినీ వర్గాలు చెప్పుకొంటాయి.

     శరత్ మారార్‌తో విభేదాలు

    శరత్ మారార్‌తో విభేదాలు

    అయితే ఈ మధ్య కాలంలో శరత్ మరార్‌ను పవన్ కల్యాణ్ పక్కన పెట్టినట్టు వార్తలు బలంగా ప్రచారమయ్యాయి. పవన్ వెంట ఎప్పుడూ కనిపించే ఆయన ఈ మధ్య కనుమరుగైపోయాడు. అందుకు కారణం సర్దార్ గబ్బర్‌సింగ్, కాటమరాయుడు చిత్రాలే కారణమని చెప్పుకొంటున్నారు.

     డిస్టిబ్యూటర్ల వ్యవహారం

    డిస్టిబ్యూటర్ల వ్యవహారం

    పవన్ కల్యాణ్ హీరోగా శరత్ మరార్ నిర్మించిన సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయం పొందడం వీరిద్దరి మధ్య విభేదాలకు దారి తీసినట్టు తెలిసింది. ఈ సినిమా ఘోర పరాజయం నేపథ్యంలో డిస్టిబ్యూటర్లు తమకు జరిగిన నష్టాన్ని చెల్లించాలంటూ ఆందోళన చేయడం వరకు వెళ్లింది.

    డిస్టిబ్యూటర్ల నష్టాన్ని

    డిస్టిబ్యూటర్ల నష్టాన్ని

    సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు చిత్రాన్ని పంపిణి చేసిన డిస్టిబ్యూటర్లకు నష్టాన్ని చెల్లించాలని శరత్ మరార్‌కు పవన్‌కు సూచించగా అందుకు ఆయన నిరాకరించినట్టు సమాచారం. ఆ వ్యవహారం పవన్‌ తీవ్రంగా పరిగణించి శరత్‌ను దూరం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ రెండు చిత్రాల వివాదం పవన్‌ ఇమేజ్‌కు నష్టం చేసేలా మారిందనేది పరిశ్రమ వర్గాల అభిప్రాయం.

     అజ్ఞాతవాసిలో పవన్

    అజ్ఞాతవాసిలో పవన్

    అజ్ఞాతవాసి సినిమా ఆడియో ఆవిష్కరణ కార్యక్రమంలో తాను నమ్మిన వాళ్లు, సన్నిహితులు అనుకొన్న వారు కష్ట సమయాల్లో అండగా నిలువలేదు అని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు చేశారు. తాను సక్సెస్‌ సాధించినప్పుడు వెంట ఉండేవారు.. కష్టాల్లో జారుకొన్నారు అని పవన్ పేర్కొన్నారు. తాను చేసిన వ్యాఖ్యలు శరత్ మరార్, ఆనంద్ సాయి లాంటి వాళ్లను ఉద్దేశించిన చేసినవేనని చెప్పుకొంటారు.

     నిర్మాత రాధాకృష్ణను ఉద్దేశించి

    నిర్మాత రాధాకృష్ణను ఉద్దేశించి

    అజ్ఞాతవాసి నిర్మాత కొందరు నిర్మాతలకు అతీతంగా ఉంటారని ప్రొడ్యూసర్ రాధాకృష్ణపై ప్రశంసల వర్షం కురిపించారు. నాపై చాలా తక్కువ ఖర్చుపెట్టి నిర్మాతలు ఎప్పుడు నా మీద పెట్టుబడి పెట్టి తక్కువ ఖర్చు పెట్టి ఎక్కువ డబ్బులు సంపాదిస్తామనే వాళ్లే ఉన్నారు. కానీ రాధాకృష్ణ మాత్రం సినిమా ఎంత కావాలి. డిస్టిబ్యూటర్లకు అండగా నిలిచే వారు కనుమరుగైపోతున్న ప్రస్తుతం సమయంలో పాతకాలపు విలువలను తిరిగి తెచ్చిన వ్యక్తి రాధాకృష్ణ గారు.

    ద్రోహం చెయవద్దని సూచన

    ద్రోహం చెయవద్దని సూచన

    నేను ఒక్కటే నమ్ముతాను. పెట్టుబడి పెట్టిన నిర్మాతకు, డబ్బులు పెట్టి సినిమా చూసేవాళ్లకు ప్రతిఫలం అందించకపోతే ద్రోహం అవుతుంది. సినిమా ఫెయిల్ అయితే డబ్బులు వదులుకోవడానికి సిద్దపడుతాను. సినిమా మీకు నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు కానీ మాలో కలుషితం ఉండకూడదు. డబ్బులు దోచేయ్యాలనే ఆలోచన ఉండకూడదు. అలాంటి లక్షణాలు లేని నిర్మాత రాధాకృష్ణ రూపంలో దొరికాడు అని పవన్ కల్యాణ్ అన్నారు.

    English summary
    Powerstar remarked that there are few producers in the industry who make movies at nominal cost and with low production values but eventually end up raking in big bucks and that the producer of Agnyathavaasi was contrast to that. It is to be noted that Kalyan's previous flicks, Sardaar Gabbar Singh and Katamarayudu were bankrolled by Sharath Marrar and both movies fizzled at the box office.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X