తెలిసే పవన్ కళ్యాణ్ రాంగ్ స్టెప్ వేస్తున్నాడా...?
'ఖుషి" తర్వాత పవన్ కళ్యాణ్ కి 'జల్సా" తప్ప చెప్పుకోదగ్గ హిట్స్ లేవనే చెప్పాలి. సెలెక్ట్టివ్ గా చేసే సినిమాలు, అతను సెలక్ట్ చేసుకునే దర్శకులు పవన్ కి ఖుషిలాంటి బ్లాక్ బస్టర్ హిట్ ని ఇవ్వలేకపోతున్నాయి. తొలిప్రేమ, ఖుషిలాంటి పెద్ద హిట్స్ ఇచ్చిన దర్శకులతో చేసిన బాలు, పులి డిజాస్టర్స్ కావడం, గుడంబాశంకర్, బంగారం, అన్నవరం, జాని నిరాశపరచడంతో ఏ కథ చెయ్యాలి, ఎవరితో చెయ్యాలి అనే విషయంలో కన్ ఫ్యూజన్ లో వున్నాడో ఏమోగానీ ఈ మధ్య పవన్ సెలక్ట్ చేసుకుంటున్న సినిమాలన్నీ అటు ఆడియన్స్ లో గానీ, ఇటు అభిమానుల్లోగానీ ఎలాంటి క్యూరియాసిటీని కలిగించలేకపోతున్నాయి.
ఓ పక్క సింగీతం శ్రీనివాసరావుతో ప్రిన్స్ ఆఫ్ పీస్ పేరుతో వస్తున్న క్రీస్తు కథాంశంతో ఓ సినిమా చేస్తుండగా, తమిళ దర్శకుడు విష్ణువర్థన్ తో 'కాళీ" చేస్తున్నాడు. హరీష్ శంకర్ తో 'గబ్బర్ సింగ్" చేయబోతున్నాడు. ఇవేవీ కళ్యాణ్ అభిమానులకు రుచించడంలేదు. ఆల్ రెడీ తీన్ మార్ రీమేక్ తో దెబ్బతిన్న పవన్ మరో రీమేక్ గబ్బర్ సింగ్ చేయడం, క్రీస్తు కథాంశంతో వస్తున్న సినిమాలో క్యారెక్ట్ ఆర్టిస్ట్ గా చెయ్యడం చూస్తుంటే ఇంతకుముందు పవన్ లో వున్న జోష్ ఇప్పుడు లేదనిపిస్తోంది. ఆ ఎనర్జీ అతనిలో కొరవడిందని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.


Click it and Unblock the Notifications











