RC15 చరిత్రలో కనీవిని ఎరుగని విధంగా ఫస్ట్ లుక్‌, దుబాయ్‌లో యష్, పవన్.. శంకర్ ప్లాన్ మామూలుగా లేదుగా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, శంకర్ ప్రాజెక్ట్ కోసం ఇండియా మొత్తం ఎదురుచూస్తోంది. ఇది అసలే శంకర్ ఎంతో ప్రెస్టిజీయస్‌గా తీసుకుని పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల కాలంలో శంకర్ మరో ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురాలేకపోయాడు. ఇండియన్ 2 మధ్యలోనే ఆగిపోయింది. అపరిచితుడు సీక్వెల్ అలానే పక్కన ఉండిపోయింది. ఇక ఇప్పుడు రామ్ చరణ్‌తో శంకర్ తీయబోతోన్న RC 15 ప్రాజెక్ట్ మీదే అందరి దృష్టి పడిపోయింది. RC15 కోసం శంకర్ ఇప్పటికీ భారీ ప్లానింగ్స్ చేసినట్టు తెలుస్తోంది. శంకర్ దేశంలో ఎక్కడ షూటింగ్ చేసినా కూడా అది వైరల్ కాసాగింది. RC మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ వివరాల్లోకి వెళితే..

RRR క్రేజ్ కూడా..

RRR క్రేజ్ కూడా..

రామ్ చరణ్ శంకర్ సినిమాకు ఈ రేంజ్ క్రేజ్ రావడానికి ఆర్ఆర్ఆర్ సినిమా కూడా ఓ కారణం. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ అద్భుతంగా నటించాడు. ఇక ఉత్తరాది ప్రేక్షకులు అయితే రామ్ చరణ్‌లో రాముడిని చూసేశారు. అలా ఆ పాత్రతో నార్త్ ఆడియెన్స్ గుండెల్లో నిలిచిపోయాడు. దీంతో రామ్ చరణ్ తదుపరి ప్రాజెక్ట్ మీద అక్కడి ప్రేక్షకులకు క్రేజ్ పెరిగింది.

దిల్ రాజు కెరీర్‌లో..

దిల్ రాజు కెరీర్‌లో..


దిల్ రాజు కెరీర్‌లో ఇక RC15 చిత్రం ప్రత్యేకంగా నిలవబోతోంది. తమ బ్యానర్లో ఇది 50వ సినిమా కావడంతో దిల్ రాజు మరింత శ్రద్ద పెట్టినట్టు తెలుస్తోంది. అందుకే ఈ క్రేజీ కాంబోను సెట్ చేశాడు దిల్ రాజు. ఈ ప్రాజెక్ట్ ప్రకటన కూడా ఓ రేంజ్‌లో జరిగింది. కేవలం పోస్టర్ కోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టినట్టు తెలుస్తోంది.

లీకుల బెడద..

లీకుల బెడద..

శంకర్ రామ్ చరణ్ కలిసి ఎక్కడ షూటింగ్ చేసినా కూడా ఈ లీకులు మాత్రం తప్పలేదు. రాజమండ్రి, పూణె, అమృత్ సర్, వైజాగ్ ఇలా ఎక్కడ షూటింగ్ చేసినా కూడా రామ్ చరణ్ లుక్స్ ఫోటోల రూపంలో, వీడియోల రూపంలో బయటకు వస్తూ చిత్రయూనిట్‌ను ఇబ్బందికి గురి చేస్తూ వచ్చాయి.

ఫస్ట్ లుక్ ఈవెంట్..

ఫస్ట్ లుక్ ఈవెంట్..

ఇక ఇండియన్ సినీ హిస్టరీలో ఇది వరకు ఎన్నడూ జరగనట్టుగా.. ఫస్ట్ లుక్ రిలీజ్ ఈవెంట్‌ను శంకర్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇందులో రామ్ చరణ్ పాత్రకు సంబంధించిన మూడు వేరియేషన్స్‌కు సంబంధించిన ఫోటోలను రిలీజ్ చేయబోతోన్నారట.

ఇక ఈవెంట్‌కు యష్, పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథులుగా హాజరవ్వనున్నారు. ఇంకా ఎంతో మంది స్టార్ హీరోలను కూడా పిలవబోతోన్నారు. మొత్తానికి ఈ మేరకు టాక్ మాత్రం ఓ రేంజ్‌లో వ్యాపిస్తోంది. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని రంగంలోకి దించేందుకు శంకర్ ప్లాన్ చేస్తున్నాడు.

Recommended Video

Bumper Offer జస్ట్ నిద్రపొతే బోలెడంత జీతం... పోటీపడి దరఖాస్తులు *Trending | Telugu OneIndia
రాంచరణ్ కెరీర్ ఇలా..

రాంచరణ్ కెరీర్ ఇలా..

రాంచరణ్ కెరీర్ విషయానికి వస్తే.. RRR, ఆచార్య చిత్రాల తర్వాత పూర్తిగా తన డేట్స్‌ను RC15 సినిమాకే కేటాయించారు. గెటప్స్, లుక్ డిఫరెంట్‌గా ఉండటంతో వేరే సినిమాలను పట్టాలెక్కించే ప్రయత్నం చేయడం లేదు. RC తర్వాత మిగితా ప్రాజెక్టులపై దృష్టిపెట్టనున్నట్టు తెలిసింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X