The Call Him OG డీవీవీ దానయ్య చేజారిన పవన్ కల్యాణ్ మూవీ.. OG సినిమా ఎవరి చేతికంటే?
RRR లాంటి ప్రపంచస్థాయి సినిమాను తెరకెక్కించిన నిర్మాత డీవీవీ దానయ్య తాజాగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌తో OG: They Call Him OG అనే సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సాహో ఫేమ్ సుజిత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఇంకా ప్రొడక్షన్ స్థాయిలోనే ఉన్న ఈ మూవీ హైప్ ఓ రేంజ్‌లో ఉంది. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రం భారీ తారాగణంతో రూపొందుతున్నది. అయితే ఈ సినిమాకు సంబంధించి.. ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది. ఆ వార్త వివరాలు, సినిమా గురించిన విశేషాలకి వెళితే..
Recommended Video

OG చిత్రంలో ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, షాన్ కక్కర్, ప్రియాంక మోహన్, శ్రీయారెడ్డి తదితరులు నటిస్తున్నారు. సలార్ సినిమాతో ప్రేక్షకులకు మరింత దగ్గరైన శ్రీయా రెడ్డి ఇటీవల మాట్లాడుతూ.. ఈ మూవీ ఓ రేంజ్‌లో ఉంటుంది. ఓజీ రిలీజైన తర్వాత ప్రేక్షకులు ఎప్పడూ చూడని హై చూస్తారు. ఆ సినిమా తర్వాత నేను రిటైర్ అయిపోదామిని అనుకొంటున్నాను. ఆ సినిమాలోని పాత్ర చేసిన తర్వాత అంత కంటే గొప్ప అనుభూతి నాకు లభించదు అని అన్నారు.

అయితే OG మూవీని డీవీడీ దానయ్య కూడా అంతే ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. అయితే మీడియా కథనాల ప్రకారం.. ఈ సినిమా నిర్మాతగా దానయ్య తప్పుకుంటున్నారు. ఆయన నుంచి వేరే ప్రతిష్టాత్మక సంస్థ ఈ ప్రాజెక్టు బదిలీ అవుతున్నది. త్వరలోనే ఈ సినిమా బ్యానర్ మార్పును అధికారికంగా వెల్లడించనున్నారు అని ఆ వార్త సారాంశం.
అయితే OG ప్రాజెక్టు నుంచి దానయ్య తప్పుకోవడం సోషల్ మీడియాలో భారీ చర్చకు దారి తీసింది. ఈ సినిమా ఆలస్యమే అందుకు కారణం అంటూ నెటిజన్లు, సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సినిమా బ్యానర్ మార్పుకు ఇదే కారణమా? మరేదేమైనా ఉందా? అనేది నిర్మాత క్లారిటీ ఇస్తేగాని రూమర్లకు అడ్డుకట్ట పడదు అని అంటున్నారు.

ఇదిలా ఉండగా, గతంలో కూడా డీవీవీ దానయ్యకు ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయి. ఇటీవల ప్రభాస్, మారుతి కాంబినేషన్‌లో వస్తున్న సినిమాకు ముందుగా డీవీవీ దానయ్యనే నిర్మాత. అయితే ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని ఆ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి అప్పగించడం చర్చనీయాంశమైంది.
ఇక RRR విషయంలోను డీవీవీ దానయ్యకు చేదు అనుభవం ఎదురైంది. ఆస్కార్ అవార్డుల కార్యక్రమం సమయంలో ఆయన పూర్తిగా దూరంగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు లభించిన తర్వాత కూడా దాని గురించి మాట్లాడటానికి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుతం OG మూవీని అట్టహాసంగా ప్రారంభించి వదులుకోవడం వెనుక కారణాలు ఏమిటో అనేది చర్చనీయాంశమవుతున్నది.


Click it and Unblock the Notifications











