పవన్ కళ్యాణ్ ది నీచమైన చరిత్ర ఆయనకు ఆ అర్హత లేదు...!?
డెక్కన్ క్రానికల్, ఆంధ్రభూమి పత్రికలతో పవన్ కళ్యాణ్ కి ఉన్న వైరం గురించి అందరికీ తెలిసిందే. ఏళ్లు గడిచినా పవన్ కళ్యాణ్ పై డిసి గ్రూప్ కోసం ఇంకా చల్లారినట్టు లేదు. అవకాశం దొరికిన్పుడల్లా పవన్ కళ్యాణ్ ని ఏకి పారేసే ఈ పత్రిక తాజాగా 'ఏసుక్రీస్తు" సినిమాలో నటించడం పట్ల ఒక పబ్లిక్ పోల్ కండక్ట్ చేసింది. నిజంగా పబ్లిక్ పోల్ నిర్వహించారో, లేక తమకు తోచిన పేర్లు రాసేసి నిర్వహించినట్టు కలరిచ్చారో కానీ మొత్తమ్మీద 'పవన్ కళ్యాణ్" ఏసుక్రీస్తుగా నటించడమేంటి..సిగ్గుచేటు" అంటూ పలువురు అభిప్రాయపడ్డట్టు ఆ పత్రిక కథనం వెలువరించింది.
పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం చాలా దారుణమైనదని, అతనికి ఏసుక్రీస్తు పాత్ర పోషించే అర్హత లేదని జనాభిప్రాయమంటూ సదరు పత్రిక దుమ్మెత్తి పోసింది. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా మరో యువతితో సహ జీవనం చేసిన నీచమైన చరిత్ర అతనిదని, అలాంటి వ్యక్తి జీసస్ గా నటిస్తే అది ఆ మహానుభావుడికే మచ్చ అని ఆ వ్యాసంలో రాసుకొచ్చారు. అయితే ఇంతగా ఆవేశపడ్డ సదరు పత్రిక కాస్త పరిశోధన చేసి ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటనేది తెలుసుకుని ఉంటే బాగుండేదని పవన్ అభిమానులు అంటున్నారు. నిజానికి ఆ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఏసుక్రీస్తుగా నటించడం లేదు. ఏసుక్రీస్తు కథలో ఒక కీలక పాత్రను మాత్రమే అతను చేస్తున్నాడు. ఇది తెలియకుండా పవన్ ని బదనాం చేయడానికే ఆ పత్రిక తొందరపడినట్టుందని అభిమానులు ఆరోపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ కి పరిటాల రవి గుండు కొట్టాడనే వదంతిని వాస్తవంగా చిత్రీకరించిందీ, దానిని ప్రంట్ పేజ్ లో ప్రింట్ చేసి ప్రచారం కల్సించిందీ కూడా సదరు పత్రికే కావడం గమనార్హం.


Click it and Unblock the Notifications











