పూరి కామెంట్‌కు పవన్ రెస్పాన్స్ ఏమిటి?

మరి పవన్ అభిమానులు చేసిన నిరసనతో అప్ సెట్ అయ్యాడో? ఏమోగానీ.....పూరి వ్యాఖ్యలు టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 'బద్రి'తో టాలీవుడ్ డైరెక్టర్‌గా ఎంట్రీ ఇచ్చిన పూరి జగన్నాథ్ తక్కువ టైం లో గొప్ప డైరెక్టర్ గా పేరు పొందిన సంగతి మనందరికి తెలిసిన విషయమే.
మరి పూరి వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారో? అని మీడియా వారు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పవన్‌ను కాంటాక్టు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రావడం లేదు. దీంతో పవన్ సన్నిహితుల ద్వారా ఇందుకు సంబంధించిన వివరాలు రాబట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
పవన్ కళ్యాణ్‌తో క్లోజ్ గా ఉండే కొందరు స్పందిస్తూ.....పవన్ ఇలాంటి వాటికి స్పందించడానికి ఇష్టపడరని అంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ ఇక ముందు ఎప్పుడైనా మీడియాకు తారస పడకపోతారా, ఈ ప్రశ్నను ఎదుర్కోలేక పోతారా. మరి అప్పుడు ఏం సమాధానం చెబుతారో చూడాలి.


Click it and Unblock the Notifications











