మళ్లీ ప్రేమలో పడ్డ పూజా హెగ్డే?.. ఆ హీరోతో పబ్లిక్‌గా, సింగిల్ పోస్ట్‌తో హింట్
ప్రస్తుతం టాలీవుడ్ టూ బాలీవుడ్ ఎక్కడ చూసినా నటీనటులు ప్రేమలు, ఎఫైర్స్, పెళ్లి వార్తలతో షాకిస్తున్నారు. కొందరు సైలెంట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని త్వరలో పెళ్లికి రెడీ అవుతున్నారు. తాజాగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే కూడా ప్రేమలో పడినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఓ స్టార్ హీరోని ఉద్దేశించి ఆమె పెట్టిన పోస్ట్ ఇందుకు బలం చేకూరుస్తోంది. మరి ఆ హీరో ఎవరు? ఎన్నాళ్ల నుంచి వీరి మధ్య ఎఫైర్ నడుస్తోంది? ఈ వివరాల్లోకి వెళితే..
మోడలింగ్ నుంచి సినిమాల వైపు వచ్చిన పూజా హెగ్డే .. షార్ట్ గ్యాప్‌లోనే స్టార్ హీరోయిన్ అనిపించుకున్నారు. తొలి రోజుల్లో ఆమె నటించిన సినిమాలు వరుసపెట్టి ఫ్లాప్ కావడంతో ఒకదశలో ఐరెన్ లెగ్ అనిపించుకున్నారు. కానీ పోయిన చోటే వెతుక్కోవాలి అన్నట్లు ఈ ముద్దుగుమ్మ టైం కోసం వెయిట్ చేసి హిట్ కొట్టి స్టార్ హీరోయిన్‌గా దూసుకొచ్చారు. హృతిక్ రోషన్, ఎన్టీఆర్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో నటించింది. తెలుగులోనే కాకుండా తమిళ్‌లోనూ వరుస హిట్ సినిమాలతో కోలీవుడ్‌లోనూ జెండా పాతింది.

తన నాలుగో సినిమాకే బాలీవుడ్ సూపర్‌స్టార్ హృతిక్ రోషన్‌తో నటించే అవకాశం దక్కించుకున్న పూజా హెగ్డే.. సౌత్‌లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ బాలీవుడ్‌లో ఛాన్స్ వస్తే మాత్రం వదులుకోవడం లేదు. గత కొంతకాలంగా పూజా హెగ్డే కెరీర్ పడుతూ లేస్తూ సాగుతోంది. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, కిసికా భాయ్ కిసి కి జాన్ వంటి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్, సూపర్‌స్టార్ మహేశ్ బాబు గుంటూరు కారం సినిమాల నుంచి ఆమె అనూహ్యంగా తప్పుకోవడం చర్చనీయాంశమైంది.
అయినప్పటికీ పట్టు వదలకుండా ప్రయత్నించిన పూజా హెగ్డే తిరిగి రేసులోకి వచ్చారు. రెట్రో, కూలీ, జన నాయగన్, కాంచన 4 వంటి క్రేజీ ప్రాజెక్ట్‌ల్లో స్థానం సంపాదించి తనపై వస్తున్న విమర్శలకు చెక్ పెట్టారు. షాహిద్ కపూర్ సరసన చేసిన దేవా ఇప్పటికే రిలీజ్ కాగా.. రెట్రో, కూలీలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్‌లకు పూజా హెగ్డే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనున్నారు.
అయితే 35 ఏళ్లు నిండుతున్నా ఇంకా పెళ్లి మాట ఎత్తడం లేదు పూజా హెగ్డే. ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి పలువురితో ఈ ముద్దుగుమ్మ ఎఫైర్స్ నడిపినట్లుగా టాక్. సల్మాన్ ఖాన్, హృతిక్ రోషన్‌తో పాటు బిగ్‌బాస్ ఫేమ్ రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ప్రేమాయణం సాగించారని గాసిప్స్ వైరల్ అయ్యాయి. రోహన్‌తో పూజ పెళ్లి వరకు వెళ్లారని బీటౌన్ టాక్. తాజాగా బుట్టబొమ్మ మరోసారి ప్రేమలో పడినట్లుగా గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్‌తో ఆమె ఎఫైర్ సాగిస్తున్నట్లుగా రూమర్లు వస్తున్నాయి. వరుణ్ ధావన్ పుట్టినరోజు సందర్భంగా ఆయనకి పూజా హెగ్డే విష్ చేశారు. అందరిలా చేసుంటే ఏ గొడవ ఉండేది కాదు.. కానీ వరుణ్ , పూజా ఇద్దరూ తమ చేతులతో హార్ట్ సింబల్ చూపిస్తూ ఉన్న ఫోటోను బుట్టబొమ్మ షేర్ చేశారు. వీరిద్దరి ప్రేమ వ్యవహారం నిజమే అనడానికి ఈ ఫోటో బలాన్ని చేకూరుస్తోంది. మరి నిజంగానే పూజా హెగ్డే ప్రేమలో పడ్డారా? లేక ఇవన్నీ గాసిప్స్ మాత్రమేనా అన్నది తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.


Click it and Unblock the Notifications











