స్టార్ హీరో కొడుకుతో పూజా హెగ్డే అఫైర్.. ప్రియుడితో కలిసి చిక్కిన బ్యూటీ

దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో కూడా అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను అందిపుచ్చుకొంటున్న హీరోయిన్లలో పూజా హెగ్డే ఒకరు. బాలీవుడ్‌లో కుర్ర హీరోయిన్లకు ధీటుగా అవకాశాలను దక్కించుకొంటున్నది. అంతేకాకుండా డేటింగ్ రూమర్లలో కూడా బాలీవుడ్ హీరోయిన్లకు తానేమీ తక్కువ కాదనే రేంజ్‌లో వ్యవహరిస్తున్నది. తాజాగా ప్రముఖ హీరో కుమారుడితో డేటింగ్ చేస్తున్నారనే విషయం బాలీవుడ్‌లో ప్రముఖంగా వినిపిస్తున్నది. వివరాల్లోకి వెళితే

టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా

టాలీవుడ్‌లో టాప్ స్టార్‌గా

టాలీవుడ్‌లో అగ్ర హీరోల సరసన అందరితోనూ జతకడుతూ స్టార్ హీరోయిన్‌గా నంబర్ వన్ స్ఠానానికి దూసుకెళ్తున్నది. అరవింద సమేత, అల వైకుంఠపురంలో లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో హీరోలకు లక్కీ మస్కట్‌గా మారింది. దాంతో ఈ ముద్దుగుమ్మకు భారీగా డిమాండ్ పెరిగింది. తనకున్న డిమాండ్‌ ఏ మాత్రం తగ్గకుండా మార్కెట్‌ను విస్తరించుకొంటూ పోతున్నది.

చేతినిండా ప్రాజెక్టులతో

చేతినిండా ప్రాజెక్టులతో

ప్రస్తుతం చేతినిండా ప్రాజెక్టులతోపాటు తెలుగు స్టార్ హీరోలందరితోనూ నటిస్తున్నది. యువ, సీనియర్ హీరోలు అనే తేడా లేకుండా ప్రాజెక్టులను చేతిలో పెట్టుకొంటున్నది. అఖిల్ అక్కినేని సరసన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రంలోనూ. ప్రభాస్‌తో ఓ డియర్ అనే చిత్రంలో నటిస్తున్నది.

బాలీవుడ్ హీరో కుమారుడితో

బాలీవుడ్ హీరో కుమారుడితో

ఇలా కెరీర్‌పరంగా దూసుకెళ్తున్న పూజా హెగ్డే బాలీవుడ్‌లో ప్రముఖ హీరో వినోద్ మెహ్రా కుమారుడు రోహన్ మెహ్రాతో అఫైర్ నడుపుతున్నట్టు వార్తలు జోరుగా షికారు చేస్తున్నాయి. అయితే వారిద్దరూ పలు సందర్భాల్లో మీడియాకు చిక్కడంతో వీరిద్దరి మధ్య స్నేహం కంటే ఎక్కువగానే ఏదో ఉందనే మాట కథనాల్లో పేర్కొంటున్నారు.

పూజా హెగ్డే డేటింగ్‌ గురించి

పూజా హెగ్డే డేటింగ్‌ గురించి

ప్రస్తుతం రోహన్ మెహ్రాతో పూజా హెగ్డే ఫోటోలు మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వారిద్దరి డేటింగ్‌ గురించి బాలీవుడ్ పత్రికలు కోడైకూస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంపై పూజా హెగ్డే గానీ, అటు రోహన్ మెహ్రా గానీ పెదవి విప్పడం లేదు. వీరితోపాటు పూజా, రోహన్ గ్రూప్‌లో అనిల్ కపూర్ కుమారుడు హర్షవర్ధన్ కూడా కలిసి ఉండటం గమనార్హం.

సల్మాన్ ఖాన్‌తో సినిమా

సల్మాన్ ఖాన్‌తో సినిమా


ఇక పూజా హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్‌పై కన్నేసింది. త్వరలో ప్రారంభం కానున్న సల్మాన్ ఖాన్ సినిమాలో నటించే అవకాశం దక్కిందనే వార్త మీడియాలో వైరల్ అయింది. అయితే సల్మాన్ కోసం రెమ్యునరేషన్ కూడా తగ్గించుకొనేందుకు సిద్ధపడినట్టు వార్తలు వస్తున్నాయి. ఇక దక్షిణాది సినిమా పరిశ్రమను అటు బాలీవుడ్‌ను బ్యాలెన్స్ చేస్తూ ప్రియుడితో రొమాంటిక్ లైఫ్‌ను చక్కదిద్దుకొంటున్నట్టు బాలీవుడ్ మీడియా పేర్కొంటున్నది.

Recommended Video

Prabhas In Trouble, Prabhas20 Film Shooting Held in Georgia
ఆకట్టుకోలేకపోయిన రోహన్ మెహ్రా

ఆకట్టుకోలేకపోయిన రోహన్ మెహ్రా

కాగా, రోహన్ మెహ్రా బజార్ అనే సినిమా ద్వారా హిందీ చిత్ర సీమకు పరిచయం అయ్యారు. 1990లో తండ్రి మరణం తర్వాత కెన్యాలోని తల్లి, సోదరి, తాతమ్మ కుటుంబంతోనే గడిపాడు. అయితే బజార్ చిత్రం అంతగా ప్రేక్షకాదరణ పొందకపోవడంతో పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. ఇప్పుడు మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్నాడనేది తాజా సమాచారం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X