OG 2 మూవీ కోసం టాప్ హీరోయిన్లు పోటీ.. పవన్ కల్యాణ్‌ పక్కన ఫైనల్‌గా ఎవరంటే?

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు సుజిత్ కాంబినేషన్‌లో వచ్చిన OG - They Call Him OG చిత్రం సంచలన విజయం సాధించింది. ఈ చిత్రానికి సీక్వెల్‌ OG 2 కోసం సుజిత్, పవన్ కల్యాణ్ యుద్ధ ప్రాతిపాదికన ప్రీ ప్రొడక్షన్ పనులను ప్రారంభించారు. ఈ చిత్రాన్ని పవన్ కల్యాణ్ స్వయంగా తన సొంత బ్యానర్ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్‌పై నిర్మించడం విశేషంగా మారింది. ఈ సినిమాకు సంబంధించిన కథాచర్చలు ఇటీవలే ముగిసాయి. వాటికి సంబంధించిన వివరాలను వీడియో రూపంలోను, ఫోటోల రూపంలోను మీడియాకు, అభిమానులకు, సినీ ప్రేక్షకులకు వెల్లడించారు. దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. అయితే ఈ సినిమాలో పవర్ స్టార్ పక్కన నటించే హీరోయిన్ ఎవరు అనే విషయంపై జోరుగా ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ఈ సినిమాలో ఫైనల్‌గా ఎవరు ఉండబోతున్నారనే వివరాల్లోకి వెళితే..

OG 2 సినిమా స్క్రిప్టును పూర్తి చేసినట్టు ఇటీవల పవన్ కల్యాణ్‌తో జరిగిన చర్చల సందర్భంగా కన్ఫర్మ్ అయింది. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ఎస్ సంగీతాన్ని అందించనున్నారు. ఈ చిత్రం కోసం సౌండ్ ట్రాక్స్ పనులు ఇప్పటికే ప్రారంభించారు. కొన్ని శాంపిల్స్ వినిపించగా సుజిత్, పవన్ కల్యాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలిసింది.

Pooja Hegde to pair with Pawan Kalyan

ఇక ఈ సినిమా షూటింగ్ ఈ ఏడాది నవంబర్‌లోనే ప్రారంభించేందుకు సిద్దమవతుున్నారు. ఈ సినిమా కోసం పవన్ కల్యాణ్ తన డేట్స్‌ను సర్దుబాటు చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లోను అంటే జపాన్‌లో కూడా జరిగే అవకాశం ఉండటంతో ఆ మేరకు అనుమతుల విషయంపై చర్చిస్తున్నట్టు తెలుస్తున్నది. ఈ వివరాలు పూర్తిగా, అధికారికంగా చిత్ర యూనిట్ వెల్లడించే అవకాశం ఉంది.

సుజిత్, పవన్ కల్యాణ్ మధ్య జరిగిన చర్చల ప్రకారం.. ఈ చిత్రం ద్వారా ఓజాస్ గంభీర కథను చెప్పేందుకు రెడీ అవుతున్నారు. జపాన్‌లోని యాకుజా, ఇతర ఇంటర్నేషనల్ సిండికేట్స్ మాఫియాల మధ్య జరిగే అధిపత్య పోరు నేపథ్యంగా సాగుతుంది. ఈ కథలో భాగంగా ఇండియన్ నేషనల్ ఆర్మీ సృష్టికర్త నేతాజీ సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా హైలెట్ అవుతుంది అని తెలిసింది. ఇప్పటికే ఈ సినిమా డిజైన్ పోస్టర్లన్నిటీలో సుభాష్ చంద్రబోస్ కనిపించడంతో కొంత క్లారిటీ వచ్చింది.

Pooja Hegde to pair with Pawan Kalyan

ఇక ఈ చిత్రంలో పవన్ కల్యాణ్ పక్కన నటించే హీరోయిన్ కోసం వేట కోనసాగుతున్నది. ఈ సినిమాలో నటించేందుకు ఇద్దరు టాప్ అండ్ సీనియర్ హీరోయిన్ల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ చిత్రం కోసం కాజల్ అగర్వాల్‌‌తో చర్చలు జరుగుతున్నాయి. అలాగే మరో హీరోయిన్ పూజా హెగ్డేతో కూడా చర్చలు జరుపుతున్నారు. వారి డేట్స్, సినిమా షూటింగులకు అందుబాటులో ఉండే వారిని ఫైనల్‌గా ఎంపిక చేస్తారు. ఫైనల్‌గా పూజా హెగ్డే ఈ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే వార్త ఫిలింనగర్‌లో చక్కర్లు కొడుతున్నది.

Read more about: pooja hegde pawan kalyan OG2
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X