తెరవెనుక ప్రభాస్ కి ఎదురైన రెడ్ సిగ్నల్..?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి పెళ్లి వయసు వచ్చిందని ఇంతకు ముందే అనుకున్నట్టు, ఇప్పుడు ప్రేమ వయస్సు కూడా వచ్చి పడ్డట్టుంది. తెర మీద రొమాన్స్ కు ఇబ్బంది పడతాను అని చెప్పిన ఈ బ్రహ్మచారి గారే ప్రేమలో మునిగిపోయాడని సినీలోకం కోడై కూస్తోంది. 'డార్లింగ్" హిట్టుతో ఇమేజ్ మార్చిన ప్రభాస్, తన తదుపరి దశరథ్ దర్శకత్వంలో రానున్న కుటుంబ కథా చిత్రంలో కూడా కాజల్ నే ఏరి కోరి పెట్టుకున్నాడు. ఒక పెద్ద హీరోతో, ఒక పెద్ద హీనోయిన్ ఇటీవల కాలంలో ఇలా వరుసగా రెండు చిత్రాలు చేయడం జరుగలేదు. మరి అంతటితో ఆగక పెళ్లి వరకు ఈ ప్రేమ ఉపద్రవం దారితీసేలా ఉండటంతో రెబల్ స్టార్ ఇంటి నుండి రెడ్ సిగ్నల్ చూపించారట. ఈ తెర వెనుక ప్రేమకథ నిజం అయితే కనుక హీరో గారు తన 'డార్లింగ్" ని గెలుచుకుంటాడా లేదా అన్నది సస్సెన్స్ ముగింపు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్ డే అక్టోబర్ 23వ తారీఖున, తన పుట్టిన రోజు పండుగను పురస్కరించుకుని ప్రభాస్ మీడియా పీపుల్ ను ఆహ్వానించి మంచి పార్టీ ఇస్తాడని సమాచారం.


Click it and Unblock the Notifications











