ప్రభాస్, అనుష్క అఫైర్ కొనసాగుతుందా? బాలీవుడ్ మీడియా సంచలన కథనం!

టాలీవుడ్ స్టార్లలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ ప్రభాస్. బాహుబలి ముందు వరకు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితమైన యంగ్ రెబల్ స్టార్ పెళ్లి టాపిక్ ఆ తర్వాత... ఇండియా వ్యాప్తంగా స్ప్రెడ్ అయింది. ఇతర రాష్ట్రాల అభిమానులు కూడా ఈ విషయం గురించి చర్చించడం మొదలు పెట్టారు. బాలీవుడ్ మీడియా సైతం పలు సందర్భాల్లో దీనిపై ఆసక్తికర కథనాలు ప్రచురించింది.

కొన్ని రోజులుగా ప్రభాస్ పెళ్లి విషయం మళ్లీ హాట్ టాపిక్ అవుతోంది. త్వరలో అతడు ఎన్ఆర్ఐ అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడని, అమెరికాలో సెటిలైన ఓ తెలుగు వ్యాపారవేత్త కూతురును ప్రభాస్ వివాహం చేసుకోబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

కుటుంబ సభ్యుల నుంచి ప్రభాస్ మీద ఒత్తిడి

కుటుంబ సభ్యుల నుంచి ప్రభాస్ మీద ఒత్తిడి

ఈ అక్టోబర్ మాసంతో ప్రభాస్ 40వ వసంతంలోకి అడుగుపెడుతున్నాడు. ఈ నేపథ్యంలో అతడిపై కుటుంబ సభ్యుల నుంచి కూడా పెళ్లి విషయంలో ప్రెజర్ పెరుగుతోందట. ఈ క్రమంలోనే ఎన్ఆర్ఐ గర్ల్ మ్యాటర్ తెరపైకి రావడంతో గమనార్హం. అయితే ప్రభాస్ పెళ్లికి ఓకే చెప్పడా? లేదా? అనే విషయంలో మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు.

అనుష్క-ప్రభాస్

అనుష్క-ప్రభాస్

బాహుబలి తర్వాత అనుష్క-ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. ఈ విషయంలో తెలుగు మీడియాతో పాటు బాలీవుడ్ మీడియాలో చాలా వార్తలు వచ్చాయి. అయితే తమకు అలాంటి ఉద్దేశ్యం లేదని, తాము కేవలం స్నేహితులం మాత్రమే అని తేల్చి చెప్పడంతో ఆ వార్తలకు బ్రేక్ పడింది.

ప్రభాస్, అనుష్క డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు

ప్రభాస్, అనుష్క డేటింగ్ చేస్తున్నట్లు కథనాలు

తాజాగా బాంబే టైమ్స్ ప్రభాస్, అనుష్క గురించి ఆసక్తికర కథనం వెలువరించింది. అనుష్కతో ప్రభాస్ ఇప్పటికీ డేటింగ్ చేస్తున్నాడని, వారు తరచూ హైదరాబాద్‌లోని తమ సీక్రెట్ స్పాట్లో రహస్యంగా కలుస్తున్నారని, ఇటీవల ‘సాహో' స్పెషల్ స్క్రింగుకు కూడా ఆమె తీసుకెళ్లినట్లు పేర్కొంది.

అమెరికాలో ప్రేమ యవ్వారం... లాస్ ఏంజెలెస్‌లో ఇంటి కోసం వెతుకుతున్నారా?

అమెరికాలో ప్రేమ యవ్వారం... లాస్ ఏంజెలెస్‌లో ఇంటి కోసం వెతుకుతున్నారా?

తమ లవ్ ఎఫైర్ గురించి వచ్చిన వార్తలను గతంలోనే ప్రభాస్, అనుష్క ఖండించారు. అయితే బాలీవుడ్ మీడియాలో తాజాగా ఈ ఇద్దరి గురించి ఇలాంటి వార్తలు రావడం చర్చనీయాంశం అయింది. అంతే కాదు ఈ ఇద్దరూ యూఎస్ఏలోని లాస్ ఏంజెల్స్‌లో ఇంటి కోసం వెతుకుతున్నారట. దీన్ని తమ లవ్ నెస్ట్‌గా ఉపయోగించుకోనున్నారట.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X