ప్రభాస్ స్టైలిష్ గ్యాంగ్ స్టర్ సినిమాకి పార్ట్ 2? దర్శకుడు ఎవరో తెలుసా?
ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర ఏ రేంజ్ లో సీక్వెల్స్ పర్వం కొనసాగుతుందో అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే నార్మల్ గా ఒకో ఇండస్ట్రీలో రీజనల్ గా సీక్వెల్స్ ఉండొచ్చు కానీ పాన్ ఇండియా లెవెల్లో సీక్వెల్స్ కి ఆద్యుడు మాత్రం దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమోళి అలాగే హీరో ప్రభాస్ లే అని చెప్పవచ్చు. కాగా ప్రభాస్ నుంచి బాహుబలి 2 తర్వాత ఎన్నో సీక్వెల్ సినిమాలు రావడం మొదలయ్యాయి.
ఇక ఈ సీక్వెల్స్ పార్ట్ 2 లు ఫ్రాంచైజ్ లలో ప్రభాస్ కూడా ఒకింత ఎక్కువ సినిమాలే చేస్తుండడం అనేది కొనసాగుతుంది. ఇలా ఇండియన్ సినిమా దగ్గర ఒక్క ప్రభాస్ నుంచే క్రేజీ సీక్వెల్స్ చాలానే ఉన్నాయి. ఇపుడు రేస్ లో ఉన్న సీక్వెల్స్ చూసుకున్నట్టు అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ తో భారీ చిత్రం సలార్ పార్ట్ 2 ఉంది. అలాగే దర్శకుడు నాగ్ అశ్విన్ తో మరో క్రేజీ ప్రాజెక్ట్ కల్కి 2898 ఎడి సీక్వెల్ ని కూడా ప్రభాస్ లాక్ చేసి స్టార్ట్ చేయాల్సి ఉంది.

వీటితో పాటుగా ఫ్యూచర్ లో బాహుబలి ఫ్రాంచైజ్ లో కూడా మరో సినిమా అవకాశం ఉందని జక్కన్న నుంచి కూడా ఆ మధ్య హింట్స్ వచ్చాయి. ఇక వీటితో పాటుగా సాహో 2 కి కూడా స్కోప్ ఉన్నట్టుగా ఆ సినిమా ఎండింగ్ లో ఇచ్చారు కానీ అది ప్లాప్ కావడంతో దానికి ఆలోచనలు లేవు. ఇంకా ఫ్యూచర్ లో సందీప్ రెడ్డి వంగ ఇంకా ఇతర దర్శకుల సినిమాలకి సీక్వెల్స్ ఉండవు అని చెప్పడానికి కూడా లేదు.
సో ఇలా ప్రభాస్ లైనప్ లో క్రేజీ సీక్వెల్ సినిమాలు ఉన్నాయి కానీ ఇపుడు మరో ఇంట్రెస్టింగ్ రూమర్స్ సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అయితే ఈసారి ప్రభాస్ నుంచి ఓ క్రేజీ సినిమాకి పార్ట్ 2 ఉండే అవకాశాలు ఉన్నాయట. ప్రభాస్ కెరీర్లో చాలా మందికి ఉన్న మోస్ట్ ఫెవరెట్ సినిమాల్లో తన కెరీర్ లోనే స్టైలిష్ గ్యాంగ్ స్టర్ డ్రామా చిత్రం "బిల్లా" ఎవరూ మర్చిపోలేరు.
కాగా ఈ సినిమాకే పార్ట్ 2 కోసం చర్చలు జరుగుతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అయితే బిల్లా పార్ట్ 2 అనే సౌండింగ్ బాగుంది కానీ ఇక్కడ ఈ సినిమాకి దర్శకుడు ఎవరు అనేది కూడా ఇపుడు మరింత ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం ఈ చిత్రాన్ని యంగ్ దర్శకుడు అలాగే ప్రభాస్ తో మరో సాలిడ్ గ్యాంగ్ స్టర్ సినిమా చేసిన దర్శకుడు సుజీత్ తో ఉండొచ్చని ఇపుడు తెలుస్తుంది.
సాహో ప్లాప్ అయినప్పటికీ దానికి కూడా మంచి ఫాలోయింగ్ ఇపుడు ఉంది. సో అందులోని మళ్ళీ బిల్లా 2 ని ఈ దర్శకుడు ప్లాన్ చేస్తున్నాడు అంటే ఆ హైప్ వేరే లెవెల్లో ఉంటుంది. కాగా ప్రస్తుతం చర్చలు వరకు మాత్రమే ఈ ప్రాజెక్ట్ ఉందట అన్నీ సెట్ అయితే మాత్రం డెఫినెట్ గా పీక్స్ లోకే ఉంటుంది అని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











