ప్రభాస్ మూవీ స్టార్ట్ కాకుండానే 150 కోట్ల డీల్.. ఇదేం క్రేజ్ రా బాబు!
ప్రస్తుతం పాన్ ఇండియా మార్కెట్ దగ్గర ఉన్నటువంటి వన్ అండ్ ఓన్లీ బిగ్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ మాత్రమే అని చెప్పొచ్చు. కాగా ప్రభాస్ ఇపుడు నటిస్తున్న నటించనున్న సినిమాలు అన్నీ కూడా రికార్డు వసూళ్లు కొల్లగొట్టడమే కాకుండా రికార్డు బిజినెస్ లని కూడా చేస్తున్నాయి. కాగా ఇప్పుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు కొన్ని సెట్స్ మీద ఉన్నాయి.
అలాగే రానున్న రోజుల్లో మరికొన్ని కూడా మొదలు కానున్నాయి. అయితే ఆఫ్టర్ బాహుబలి 2 ప్రభాస్ క్రేజ్ వేరే లెవెల్లోకి మారిపోయింది. దీనితో తన ప్రెజెన్స్ ఉంటే చాలు సినిమాలు స్టార్టింగ్ స్టేజి లో ఉన్నపుడే రికార్డు డీల్స్ చేసుకుంటున్నాయి. కాగా అప్పట్లో వచ్చిన "రాధే శ్యామ్" సినిమాకి అయితే ఏకంగా 300 కోట్ల ఓటిటి డీల్ కూడా వచ్చినట్టుగా వార్తలు వచ్చాయి.

అలాంటి స్టార్డంని తెచ్చుకున్న డార్లింగ్ హీరో ఇప్పుడు చేస్తున్న సినిమాలకు కూడా రికార్డు డీల్స్ సినిమాలు రిలీజ్ కి ముందే అందిస్తున్నాడు. అలా ఇప్పుడు తాను చేస్తున్న ఓ సినిమాకి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న సినిమాకి ఏకంగా 150 కోట్ల డీల్ ని కేవలం ఓటిటి హక్కులతోనే అందించినట్టుగా తెలుస్తుంది.
కాగా ఇపుడు ప్రభాస్ చేస్తున్న సినిమాలు రెండు సెట్స్ మీద ఉన్నాయి. ఒకటి దర్శకుడు మారుతీతో కాగా మరో సినిమా దర్శకుడు హను రాఘవపూడితో చేస్తున్న పీరియాడిక్ బిగ్ ప్రాజెక్ట్. మరి ఇదిలా ఉండగా ఈ రెండు సినిమాలు కూడా దేనికదే సెపరేట్ జానర్ కాగా వీటిలోని ఓ సినిమా సెన్సేషనల్ డీల్ తో ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ వచ్చినట్టుగా తెలుస్తుంది.
కాగా ఆ సినిమా ఏదో కాదు జస్ట్ కేవలం ఈ మధ్యనే మొదలైన సినిమా దర్శకుడు హను రాఘవపూడితో సినిమా అట. ఈ సినిమా ఇప్పుడిప్పుడే షూటింగ్ జరుపుకుంటుంది. కాగా ఇంత ఎర్లీ స్టేజి లోనే ఓటిటి డీల్ అది కూడా రికార్డు ధర 150 కోట్లకి ఫిక్స్ చేసినట్టుగా కొన్ని గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న సినిమాకి ఈ రేంజ్ బిజినెస్ అంటే అది ప్యూర్ ప్రభాస్ స్టామినానే అని చెప్పొచ్చు.

అన్నట్టు ఈ సినిమాకి ఈ మొత్తంలో డీల్ ఇచ్చింది. పాపులర్ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ వారు అన్నట్టు వినిపిస్తుంది. మరి ఇది ఎంతవరకు నిజం అనేది తెలియాల్సి ఉంది. కాగా ఈ భారీ సినిమాలో కొత్త బ్యూటీ ఇమాన్వి ప్రభాస్ సరసన నటిస్తుండగా దర్శకుడు హను రాఘవపూడి ఈ సినిమాని 1940 బ్యాక్ డ్రాప్ లో తీసుకున్నారు. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ అయితే ఈ సినిమాని నిర్మాణం వహిస్తున్నారు.
అలాగే ప్రస్తుతం ప్రభాస్ కూడా షూటింగ్ లో జాయిన్ అయ్యాడట. ఈ సినిమా షూటింగ్ త్వరగానే పూర్తి చేసి వచ్చే ఏడాదికే సినిమాని తీసుకొచ్చేసే సన్నాహాలు మేకర్స్ చేస్తున్నట్టుగా సినీ వర్గాలు చెబుతున్నాయి. అలాగే దీనితో పాటుగా ది రాజా సాబ్ కూడా దాదాపు సగానికి పైగా పూర్తయ్యిపోయింది. రీసెంట్ గా వచ్చిన మోషన్ పోస్టర్ కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది


Click it and Unblock the Notifications











