Kalki 2898 AD కల్కి రిలీజ్ తర్వాత ప్రభాస్ షాకింగ్ నిర్ణయం!

ప్రస్తుతం బిజీగా ఉన్న ప్యాన్ ఇండియా స్టార్లలో ప్రభాస్ కూడా ఒకరు. ఆయన చేతిలో ఇప్పుడు దాదాపు 5 సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి కల్కి 2898 ఏడి. ఈ మూవీ త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతుండగా, తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం ప్రభాస్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆ నిర్ణయం ఏంటో తెలుసుకుందాం పదండి.

కల్కి 2898 ఏడీ మూవీ జూన్ 27న రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్లలో చిత్ర బృందం బిజీగా ఉంది. మరోవైపు ప్రభాస్ ఈ సినిమాతో పాటు మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న రాజాసాబ్ షూటింగ్ ను కూడా చేసేస్తున్నారు. ఈ రెండు సినిమాలు కాకుండా ప్రభాస్ సాలిడ్ లైనప్ లో సీతారామం ఫేమ్ డైరెక్టర్ హను రాఘవపూడితో ఓ సినిమా, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో బ్లాక్ బస్టర్ మూవీ సలార్ సీక్వెల్ శౌర్యంగపర్వం, డాషింగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ అనే సినిమాలు చేయాల్సి ఉంది.

Is Prabhas to Focus completely On Spirit after Kalki 2898 AD Release

త్వరలోనే రాజాసాబ్ మూవీ షూటింగ్ పూర్తి కానున్న నేపథ్యంలో ఆయన నెక్స్ట్ ప్రాజెక్ట్ ల గురించి కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఒక ప్రాజెక్ట్ పై మాత్రమే పని చేయాలని ప్రభాస్ డిసైడ్ అయ్యారట. అందుకే ముందుగా హను రాఘవపూడి ప్రాజెక్టుకు ఈ రూల్ ను అప్లై చేయబోతున్నారు. జూలై నుంచి ఈ మూవీ షూటింగ్ ను స్టార్ట్ చేయబోతున్నారు. ఈ ఏడాది ఎండింగ్ లోపే హను-ప్రభాస్ మూవీ షూటింగ్ పూరయ్యేలా ప్లాన్ చేశారు.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించే స్పిరిట్ మూవీ 2024 చివరికల్లా సెట్స్ పైకి వెళ్లబోతోంది. అయితే ఇప్పటిదాకా రెండు పడవల ప్రయాణం చేసిన ప్రభాస్ ఇక నుంచి ముఖ్యంగా స్పిరిట్ విషయంలో కేవలం ఒకే ప్రాజెక్ట్ పై ఫోకస్ చేయాలని డిసైడ్ అయ్యారట. కంప్లీట్ గా స్పిరిట్ మూవీపైనే దృష్టి పెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ మూవీ పూర్తయ్య దాకా ఆయన మరే ప్రాజెక్ట్ జోలికి వెళ్ళకూడదు అని నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం స్పిరిట్ కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ఫైనల్ స్టేజ్ లో ఉంది.

Is Prabhas to Focus completely On Spirit after Kalki 2898 AD Release

ఇక ఈ మూవీ పూర్తయ్యాక సలార్ 2 పట్టాలెక్కే అవకాశం ఉంది. శౌర్యంగపర్వం మూవీ పట్టాలు ఎక్కడానికి కనీసం రెండేళ్లు సమయం పట్టే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ప్రభాస్ చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే సలార్ ను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రాజెక్ట్ పై కాన్సన్ట్రేట్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కు సంబంధించిన ప్రాజెక్టు షూటింగ్ ఎక్కువగా విదేశాల్లోనే జరగనుంది. ఇటు ప్రశాంత్ నీల్, అటు ప్రభాస్ తమ చేతిలో ఉన్న సినిమాలన్నీ పూర్తయ్యాక శౌర్యంగపర్వం మూవీపై దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ప్రభాస్ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మంచి క్వాలిటీ ఉన్న సినిమాను తన అభిమానులకు ఇవ్వగలుగుతాడు. అలాగే ప్రభాస్ కు కూడా కాస్త టైమ్ దొరుకుతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X