స్టార్ హీరోయిన్‌కు ప్రభాస్ షాక్.. ముద్దుగుమ్మ లేకుండానే షూటింగ్.. ఆ తార ఎవరో తెలుసా?

సినీ తారలు, హీరో, హీరోయిన్లకు మధ్య అభిప్రాయ బేధాలు తలెత్తడం ఇండస్ట్రీలో సాధారణంగా కనిపిస్తుంటాయి. వాటి వల్ల నిర్మాత, దర్శకులకు ఇబ్బందులు రావడం, వాటిని పరిష్కరించుకోవడానికి అనేక తంటాలు పడటమనే విషయం వింటూనే ఉంటాం. హీరోయిన్ల యాటిట్యూడ్ కారణంగా హీరోలు హర్ట్ కావడమనేది కూడా జరుగుతూనే ఉంటుంది. అయితే దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లో అగ్రతారగా నటిస్తున్న హీరోయిన్ తీరు, ప్రవర్తనతో ప్రభాస్ మనస్తాపానికి గురైనట్టు సమాచారం. దాంతో దర్శకుడు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు తెలిసింది. ఆ హీరోయిన్ వల్ల ఎదురైన సమస్యలు ఏమిటంటే..

హీరోయిన్ కారణంగా సమస్యలు

హీరోయిన్ కారణంగా సమస్యలు

సాహో తర్వాత ప్రభాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చిత్రం షూటింగ్ చాలా రోజులు యూరప్‌లో షూటింగు జరుపుకొన్నది. అయితే ఈ సినిమా షూటింగు కొంచెం మిగిలి ఉండగా ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ పరిస్థితులు దారుణంగా మారడంతో చిత్రీకరణ వాయిదా పడింది. రిలీజ్ డేట్ కూడా మారుతూ వస్తున్నది. అయితే యూరప్ షూటింగులో సదరు హీరోయిన్ ప్రవర్తించిన తీరు యూనిట్‌కు తలనొప్పులు తెచ్చిపెట్టినట్టు తెలిసింది.

 ప్రభాస్ అంటిముట్టనట్టుగా

ప్రభాస్ అంటిముట్టనట్టుగా

యూరప్‌లో పరిస్థితులు అంతగా లేకపోవడంతో ఇటీవల హైదరాబాద్‌లోనే సెట్ వేసి షూటింగు చేస్తున్నారు. ఈ షూటింగు సందర్భంగా సదరు హీరోయిన్‌తో ప్రభాస్ అంటి ముట్టనట్టు ఉన్నారనే విషయం గురించి యూనిట్ సభ్యులు గుసగుసలాడటంతో హీరోయిన్ వ్యవహారం బయటకు పొక్కింది. అయితే హీరోయిన్ బిహేవియర్ గురించి ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్ జోరుగా నడుస్తున్నది. సాధారణంగా డార్లింగ్ లాంటి హీరోతో ఆ హీరోయిన్ అలా ప్రవర్తించడం ఏమిటనే చర్చ మొదలైంది.

 రొమాంటిక్ సీన్లను గ్రాఫిక్స్‌తో

రొమాంటిక్ సీన్లను గ్రాఫిక్స్‌తో

ఇటీవల హైదరాబాద్‌ జరిగిన షూటింగులో హీరోయిన్‌తో షూటింగు చేయడానికి ప్రభాస్‌ నిరాకరించారట. పునర్జన్మ, టైమ్ లైన్ ఆధారంగా నడిచే ఈ కథలో ఇద్దరి మధ్య రొమాంటిక్ సీన్ల ఉండటంతో ఆ సీన్లను చిత్రీకరించడం దర్శకుడికి సమస్యగా మారింది. దాంతో గ్రాఫిక్స్ ఉపయోగించి కొన్ని క్లోజ్ సీన్లను పూర్తి చేస్తునట్టు సమాచారం. ఇందుకోసం ప్రత్యేకంగా గ్రాఫిక్ నిపుణులతో కసరత్తు చేసి సీన్లను పూర్తి చేసే పనిలో ఉన్నారనే విషయంపై టాక్ నడుస్తున్నది.

హీరోయిన్‌పై పీకల్లోతు అసంతృప్తి

హీరోయిన్‌పై పీకల్లోతు అసంతృప్తి

ప్రేమకథా చిత్రంగా రూపొందుతున్న మూవీలో చాలానే లిప్‌లాక్, కౌగిలింత సీన్లు చాలానే ఉన్నాయట. అయితే ప్రభాస్ ఆ హీరోయిన్‌తో చేయడానికి ఇష్టపడకపోవడం బాడీ డబుల్‌తో సీన్లు చేసి వాటిని అనుమానం రాకుండా, ప్రేక్షకులు గుర్తించకుండా గ్రాఫిక్స్‌తో సహాయంతో సన్నివేశాలను పూర్తి చేస్తున్నారట. హీరోయిన్ వల్ల షూటింగులో సమస్యలు రావడం ప్రభాస్ తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తున్నది. ప్రస్తుతం ఆ హీరోయిన్ పేరు చెబితే తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం.

 హీరోయిన్ తలబిరుసుగా

హీరోయిన్ తలబిరుసుగా

షూటింగులో దర్శకుడు, హీరోతో ఆ హీరోయిన్ తలబిరుసుగా వ్యవహరించినట్టు తెలుస్తున్నది. అందుకు షూటింగులో ఆ హీరోయిన్‌తో ముభావంగా ఉంటున్నారని, చిత్ర యూనిట్ కూడా ఈ సినిమా షూట్ పూర్తి చేసి హీరోయిన్‌ను పంపించే పనిలో ఉందనే విషయం చర్చగా మారింది. ఇటీవల కాలంలో తమిళ్‌లో కూడా హీరోయిన్ భారీ ఆఫర్లు అందుకోవడం, కోవిడ్ పరిస్థితుల కారణంగా డేట్స్ అడ్జస్ట్ చేయడం హీరోయిన్‌కు కష్టంగా మారిందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.

వాస్తవం ఎంత అనే విషయంపై చర్చ

వాస్తవం ఎంత అనే విషయంపై చర్చ

అయితే హీరోయిన్‌కు సంబంధించిన రూమర్లపై చిత్ర యూనిట్ మాత్రం పెదవి విప్పడం లేదు. ఇందులో వాస్తవం ఎంత అనేది బయటపడటం ఖాయమనే విషయాన్ని చెబుతున్నారు. ప్రభాస్‌తో ఆ హీరోయిన్ వ్యవహరించిన తీరుకు మాత్రం సినీ వర్గాలు నొచ్చుకొంటున్నట్టు తెలుస్తున్నది. ఇటీవల ఓ స్టార్ నిర్మాతతో కూడా ఇలాంటి వ్యవహరమే జరిగినట్టు మీడియాలో కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X