ప్రభాస్‌తో కేజీఎఫ్ డైరెక్టర్.. పక్కా ఊరమాస్ కథతో.. టాలీవుడ్‌లో వైరల్‌గా..
కేజీఎఫ్ విజయంతో విమర్శకుల ప్రశంసలు అందుకొంటున్న ప్రశాంత్ నీల్‌కు ఆఫర్లు వెల్లువెత్తుతున్నాయి. కేజీఎఫ్ సినిమాతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించాడు ప్రశాంత్. ఇప్పుడు దక్షిణాదిలోని ప్రముఖ సినీ నిర్మాతలందరూ ప్రశాంత్‌పై నజర్ పెట్టారు. అయితే తాజాగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్‌తో సినిమా చేసేందుకు యూవీ క్రియేషన్ ఒప్పందం కుదుర్చుకొన్నారనే వార్త వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే..

యూవీ క్రియేషన్స్‌తో ప్రశాంత్ నీల్
కేజీఎఫ్ బంపర్ హిట్ తర్వాత ప్రశాంత్ నీల్‌ను ప్రముఖ సినీ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్ సంప్రదింపులు జరిపిందట. ఆయనతో మాస్ అంశాలు ఉన్న సినిమాను డైరెక్ట్ చేయించే పనిలో ఉంది అని తెలుగు మీడియాలో ఓ వార్త వైరల్‌గా మారింది. ప్రశాంత్ కూడా అందుకు సముఖంగా ఉన్నట్టు సమాచారం.

సొంత బ్యానర్‌లో ప్రశాంత్‌తో ప్రభాస్
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన సొంత బ్యానర్ యూవీ క్రియేషన్‌లో ఓ సినిమా చేయనున్నారు. ఆ సినిమా కోసమే యూవీ క్రియేషన్ ప్రశాంత్‌తో చర్చలు జరిపినట్టు తెలిసింది. ప్రభాస్‌ను డైరెక్ట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.

కేజీఎఫ్‌తో భారీ సక్సెస్
కన్నడ చిత్ర పరిశ్రమలో శ్రీ మురళీ అనే హీరోతో ఉగ్రం అనే సినిమాతో ప్రశాంత్ నీల్ డైరెక్టర్‌గా మారాడు. ఉగ్రం సినిమా నేరేషన్, టేకింగ్, కథ, నటీనటుల ఫెర్మార్మెన్స్ శాండల్ ఉడ్‌లో ప్రశంసలు అందుకొన్నది. విమర్శకులు ప్రశాంత్ పనితీరు ప్రశంసించారు. ఆ తర్వాత కేజీఎఫ్ సినిమాతో ప్రశాంత్ మరోసారి భారీ సక్సెస్‌ను చేజిక్కించుకొన్నారు.

150 కోట్లవైపు ప్రశాంత్ నీల్ మూవీ
దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేసిన కేజీఎఫ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.28.5 కోట్లు వసూలు చేసింది. వారాంతంలో కూడా భారీ కలెక్షన్లు సాధించింది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కేజీఎఫ్ చిత్రం రూ.100 కోట్ల క్లబ్‌ను దాటి.. 150 కోట్ల క్లబ్ వైపు పరుగులు పెడుతుంది.


Click it and Unblock the Notifications











