AP Elections 2024 ప్రభాస్ మూవీకి ఎలక్షన్స్ షాక్.. Kalki 2898 AD (కల్కి) రిలీజ్ వాయిదా?
తెలుగు సినీ పరిశ్రమలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్ 50 ఏళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం కల్కి 2898 AD. ఈ సినిమాకు మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్, దీపిక పదుకోన్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ తదితరులు నటిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందించిన ఈ సినిమాను మే 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే చిత్ర రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే..
దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ నగరా మోగించింది. వివిధ రాష్ట్రాల్లో ఏడు దఫాలుగా ఈ ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడుదల ఎన్నికలు ఏప్రిల్ 19వ తేదీన, రెండో దఫా ఎన్నికలు 26వ తేదీ ఏప్రిల్, మూడో దఫా ఎన్నికలు మే 7వ తేదీన, నాలుగో దఫా ఎన్నికలు మే 13వ తేదీన, ఐదో దఫా ఎన్నికలు మే 210 తేదీన, ఆరో దఫా ఎన్నికలు మే 25వ తేదీన, ఏడో దఫా ఎన్నికలు జూన్ 1వ తేదీన జరిపించేందుకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది.

అయితే కల్కి చిత్రాన్ని ముందస్తుగానే మే 9వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ రిలీజ్ డేట్ సమయంలో ఏపీ, తెలంగాణలో ఎన్నికల సమరం జోరుగా సాగుతుంది. అభ్యర్థులు, పార్టీలు ప్రచారంలో తలమునకలై ఉంటారు. అంతేకాకుండా ప్రజల్లో పొలిటికల్ ఫీవర్ ఉంటుంది. మే 11వ తేదీ వరకు ఏపీ, తెలంగాణలో ప్రచారం కొనసాగుతుంది.
అయితే ఈ పరిస్థితుల్లో కల్కి మూవీ విడుదల చేస్తే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. రాజకీయ వాతావరణ ప్రభావం సినిమాపై పడితే కలెక్షన్ల పరంగా సమస్యలు ఏర్పడే ఛాన్స్ లేకపోలేదు. దాంతో మే 9వ తేదీ రిలీజ్‌ను వాయిదా వేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది.

అయితే దేశవ్యాప్తంగా ఎన్నికలు ముగిసిన తర్వాత కల్కి మూవీని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ మేరకు సినిమా యూనిట్, ఇతర సభ్యులు, డిస్టిబ్యూటర్లతో నిర్మాత, దర్శకులు సమావేశమవుతున్నట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో మరో అనువైన డేట్‌ను చూసి విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. మే 9వ తేదీన రిలీజ్ కాకుండా దసరా పండుగ కానుకగా సినిమా రిలీజ్ కావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి.


Click it and Unblock the Notifications











