యువ ఎమ్మెల్యేతో యాంకర్ ప్రదీప్ డేటింగ్.. సీక్రెట్‌గా పీకల్లోతు ప్రేమలో..

ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ- నేషనల్ క్రష్ రష్మిక మందన్నలు ఫిబ్రవరి 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. గత కొన్నేళ్లుగా సాగుతున్న ప్రేమాయణానికి చెక్ పెట్టారు. ఇక మార్చి 6వ తేదీన మెగా హీరో అల్లు శిరీష్ - నయనిక రెడ్డిల వివాహం జరగనుంది. వీరు కాకుండా మరికొందరు త్వరలో పెళ్లి పీటలెక్కే అవకాశాలు ఉన్నాయని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి. తాజాగా తెలుగునాట స్టార్ యాంకర్‌గా చెలామణి అవుతున్న ప్రదీప్ మాచిరాజు పేరు కూడా ఈ లిస్ట్‌లో వినిపిస్తోంది. ఈ వివరాల్లోకి వెళితే..

తెలుగు బుల్లితెరే కాదు.. భారతీయ టెలివిజన్ రంగంలో ఆడవాళ్లదే హవా. ఎవరో ఒకరిద్దరు పుణ్య పురుషులు మాత్రమే మేల్ డామినేషన్‌ను తట్టుకుని నిలబడుతున్నారు. తెలుగు ఇండస్ట్రీ వరకు వస్తే.. యాంకర్లు అంటే సుమ, ఉదయభాను, ఝాన్సీ, అనసూయ, రష్మీ గౌతమ్, శ్రీముఖి వంటి వారు స్టార్ యాంకర్లుగా వెలుగొందుతున్నారు. సుమ అయితే దాదాపు 25 ఏళ్లకు పైగా స్టార్ యాంకర్‌గా బుల్లితెరను మహారాణిగా ఏలుతున్నారు.

Is Pradeep Machiraju Set to Marry a Young MLA Viral Wedding Rumours Explained

అలాంటి ఫిమేల్ యాంకర్ల రాజ్యంలో అడుగుపెట్టి వారికే పోటీ ఇచ్చే రేంజ్‌కి వచ్చాడు ప్రదీప్ మాచిరాజు. మనోడిని స్పూర్తిగా తీసుకుని మరింత మంది కుర్రాళ్లు యాంకరింగ్ వైపు వచ్చారు. దాదాపు 15 ఏళ్లుగా చలాకీతనం సమయస్పూర్తి, పంచ్‌లతో యాంకరింగ్‌ చేస్తూ వెలుగొందుతున్నాడు ప్రదీప్ మాచిరాజు. ఎలాంటి అశ్లీలతకు తావు లేకుండా పద్ధతిగా యాంకరింగ్ చేస్తూ అభిమానులను సంపాదించుకున్నాడు. యాంకరింగ్‌లో తనకు తిరుగులేదని నిరూపించిన ప్రదీప్.. పలు సినిమాల్లోనూ అవకాశాలు అందుకున్నాడు. ఆ తర్వాత 30 రోజుల్లో ప్రేమించడం ఎలా, అక్కడ అమ్మాయి.. ఇక్కడ అబ్బాయి సినిమాలతో హీరో అని అనిపించుకున్నాడు.

బుల్లితెర రంగంలో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్స్ లిస్ట్ తీస్తే అందులో ఫస్ట్ పేరు ప్రదీప్ మాచిరాజుదే ఉంటుంది. సోషల్ మీడియాలో అతని పెళ్లిపై ఎన్నోసార్లు డిస్కషన్ నడిచింది. పలు షోలకు వచ్చిన జడ్జిలు కూడా నేరుగా ఇదే ప్రశ్నతో అతని మీద పంచ్‌లు విసిరిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయినప్పటికి ఓ చిన్న స్మైల్‌తో తప్పించుకున్నాడే కానీ.. ఎప్పుడూ ఏం మాట్లాడలేదు. గత కొద్దిరోజుల నుంచి ప్రదీప్ పెళ్లికి సంబంధించి ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఓ అమ్మాయితో మనోడు సీక్రెట్‌గా రిలేషన్ నడుపుతున్నాడట. అది కూడా ఏకంగా యంగ్ ఎమ్మెల్యేతోనని గాసిప్స్ వైరల్ అవుతున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ ఎమ్మెల్యేతో ప్రదీప్ రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ యంగ్ ఎమ్మెల్యేది రాయలసీమ ప్రాంతంలో రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబమట. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించిన ఆమె 2024 ఎన్నికల్లో ఘన విజయం సాధించి తన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే పనిలో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో సరదు మహిళా ఎమ్మెల్యేతో ప్రదీప్‌ సీక్రెట్‌గా ప్రేమాయణం సాగిస్తున్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లుగా గడిచిన ఏడాదిగా వార్తలు వస్తున్నాయి. అయితే రెండు వేర్వేరు రంగాలకు చెందిన ఈ ఇద్దరికీ ఎప్పుడు? ఎక్కడ? పరిచయం ఏర్పడిందన్న దానిపై నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు

ఇదిలాఉండగా.. సదరు మహిళా ఎమ్మెల్యేతో రిలేషన్, పెళ్లిపై వస్తున్న వార్తలపై ప్రదీప్ మాచిరాజు గతంలోనే స్పందించారు. పెళ్లిపై నాకు ఇప్పట్లో ఎలాంటి ఆలోచన లేదు. ముందు జీవితంలో స్థిరపడాలి. గతంలో రియల్ ఎస్టేట్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయితో నా పెళ్లి అన్నారు.. ఇప్పుడు రాజకీయ నాయకురాలితో పెళ్లి అని రాస్తున్నారు. రేపు మహిళా క్రికెటర్‌తో పెళ్లి అని రాస్తారేమో. నా పెళ్లిపై ఎలాంటి ప్లాన్ లేదు.. నాకంటూ కొన్ని లక్ష్యాలు ఉన్నాయి, వాటిని పూర్తి చేసిన తర్వాతే పెళ్లిపై ఆలోచిస్తా. ప్రస్తుతం నా గురించి వస్తున్న వార్తలపై ఎలాంటి నిజం లేదని ప్రదీప్ మాచిరాజు తేల్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X