twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Prashanth Neel ప్రభాస్‌ కోసం మరింత రిస్క్.. నిర్మాత నో కాంప్రమైజ్ బడ్జెట్‌ ఎంత పెరిగిందంటే?

    |

    భారతీయ సినిమా పరిశ్రమలో KGF Chapter 2 సాధించిన విజయం దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో యష్‌కు మంచి పేరు తెచ్చిపెట్టింది. ప్యాన్ ఇండియా స్థాయిలో వారికి విశేషమైన క్రేజ్ ఏర్పడింది. ఈ క్రమంలో ప్రశాంత్ నీల్, యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కలిసి సలార్‌ను ప్రేక్షకుల ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం సలార్ సినిమాకు సంబంధించిన బడ్జెట్ వ్యవహారం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతున్నది. ఆ వార్తకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

    ప్రశాంత్ నీల్‌కు ఛాలెంజ్‌గా

    ప్రశాంత్ నీల్‌కు ఛాలెంజ్‌గా


    KGF Chapter 2 మూవీ తర్వాత ప్రశాంత్ నీల్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం కేజీఎఫ్ సిరీస్‌కు మించి విజయాన్ని అందించాల్సిన అవసరం ఏర్పడింది. అటు ప్రభాస్ ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. రాధే శ్యామ్ ఫ్లాప్ తర్వాత ఇలాంటి అంచనాలు ప్రశాంత్ నీల్‌కు ఛాలెంజ్‌గా మారాయి. అందుకే సలార్ సినిమాపై ప్రత్యేక దృష్టిని పెట్టారు.

    భారీగా పెరిగిన బడ్జెట్

    భారీగా పెరిగిన బడ్జెట్


    కరోనా వైరస్ లాక్‌డౌన్ కారణంగా సినీ పరిశ్రమనే కాకుండా అన్ని వ్యాపారాల్లోను అనుకొన్న బడ్జెట్ కంటే ఎక్కువగా పెరిగిపోవడం తెలిసిందే. సలార్ సినిమాకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. దాంతో సలార్ బడ్జెట్ అనుకొన్న దాని కంటే ఎక్కువగానే అయ్యేటట్టు కనిపిస్తున్నది. సలార్ బడ్జెట్ పెరగడంపై నిర్మాత విజయ్ కిర్‌గందూర్ తనదైన శైలిలో స్పందించినట్టు సమాచారం.

    ప్రభాస్ క్రేజ్‌కు తగినట్టుగానే

    ప్రభాస్ క్రేజ్‌కు తగినట్టుగానే


    KGF Chapter 2 తర్వాత పెరిగిన అంచనాలను చేరుకొనేందుకు తన కథ, కథనాల్లో కొంత మార్పు చేశారని, ప్రభాస్ క్రేజ్ తగినట్టుగా ఇంతకు ముందు సినీ రంగంలో నభూతో నభవిష్యత్ అనే విధంగా రెండు హై ఓల్టేజ్ ఫైట్ సీన్లను గ్రాండ్‌గా చిత్రీకరించాలని ప్రశాంత్ నీల్ భావించారు. ప్రభాస్‌తో రూపొందించే యాక్షన్ సినిమా మరో లెవెల్‌కు వెళ్లే విధంగా ఉండాలని ఫైట్స్‌ను భారీగా రూపొందిస్తున్నట్టు సమాచారం.

    20 శాతం పెరిగిన సలార్ బడ్జెట్

    20 శాతం పెరిగిన సలార్ బడ్జెట్


    దక్షిణాది మీడియాలో ప్రచారం జరుగుతున్న సలార్ బడ్జెట్ గురించిన విషయాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రశాంత్ నీల్ విజన్ ప్రకారం సలార్ బడ్జెట్‌ను నిర్మాత విజయ్ 20 శాతం పెంచారు. గతంలో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లు అనుకొన్నారు. అదనంగా మరో 40 కోట్లు పెరిగింది. అయితే సినిమా మేకింగ్ విషయంలో ఎలాంటి రాజీ పడే అవసరం లేదనే మాటను విజయ్ కిర్‌గందూర్ అన్నట్టు తెలుస్తున్నది.

    సలార్ రేంజ్ ఎంతంటే?

    సలార్ రేంజ్ ఎంతంటే?


    ప్రస్తుతం సలార్ కాంబినేషన్‌పై అంచనాలు పెరిగాయి. ప్రశాంత్ నీల్, ప్రభాస్ రేంజ్‌లో సినిమా ఉండాలి. అలాగే ఫ్యాన్స్‌లో ఎలాంటి సంతృప్తి కలిగించవద్దు అని పేర్కొన్నట్టు సమాచారం. సలార్‌ను భారతీయ సినిమా రంగంలో ఓ విశిష్టస్థానంలో పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి అని నిర్మాత అభిప్రాయపడినట్టు సమాచారం.

    English summary
    KGF Chapter success made Prashanth more extra focus on Prabhas's Salaar movie. As per reports, Salaar Movie has spending extra 40 crores to 200 crore budget.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X