బాలకృష్ణ, మోక్షజ్ఞతో మల్టీస్టారర్ లోడింగ్.. డైరెక్టర్ ఎవరో తెలుసా?
ఒకప్పుడు ఇండియన్ సినిమా దగ్గర దిగ్గజ హీరోలు దర్శకులు కలిసి ఎన్నెన్నో మల్టీ స్టారర్ చిత్రాలు తీసేవారు. ఇప్పుడు అంటే జెనరేషన్ గ్యాప్ మూలాన ఓ హీరోకి మరో హీరోకి స్పేస్ వచ్చింది కానీ అప్పట్లో ఇప్పుడు బిగ్ స్టార్స్ గా ఉన్న చాలా మంది అన్ని భాషల్లో కూడా ఇంట్రెస్టింగ్ మల్టీ స్టారర్ సినిమాలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అప్పటికి అవి సింపుల్ గానే ఉండేవి ప్రేక్షకులు కూడా ఎంతో బాగా ఆదరించేవారు.
కానీ ఇప్పుడు మల్టీ స్టారర్ అంటే ఒక సెన్సేషన్ గా మారింది. ఒకే ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు హీరోస్ ఓ సినిమాలో కనిపిస్తే బాక్సాఫీస్ బద్దలవ్వాల్సిందే. అలాంటిది ఇపుడు వీటితో పాటుగా ఒకే సినిమాలో ఇతరాత్ర ఇండస్ట్రీల టాప్ స్టార్స్ కూడా కలిసి కనిపిస్తూ మళ్ళీ పూర్వ వైభవాన్ని తెచ్చి పెట్టారు. కాగా ఇటీవల బాగా వైరల్ అయ్యిన మల్టీ స్టారర్ సినిమా ఏదన్నా ఉంది అంటే అది RRR చెప్పవచ్చు.

సెన్సేషనల్ ఫోర్సెస్ మెగా హీరో రామ్ చరణ్ నందమూరి హీరో ఎన్టీఆర్ లతో దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ఈ క్రేజీ మల్టీ స్టారర్ తో మళ్ళీ మల్టీ స్టారర్ సినిమాల హవా మొదలైంది. కాగా ఇప్పుడు ఇలా మన తెలుగు సినిమా నుంచి మరో బిగ్ మల్టీ స్టారర్ పడబోతున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. అది కూడా నందమూరి ఫ్యామిలీ నుంచి అన్నట్టు వినికిడి.
మాస్ లో నందమూరి ఫ్యామిలీ క్రేజే వేరు. అలాంటిది ఇప్పుడు హీరో బాలకృష్ణ అలాగే తన వారసుడు మోక్షజ్ఞ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు అంటే ఎలా ఉంటుంది? అది కూడా పాన్ ఇండియా బ్లాస్ట్ హిట్ ఇచ్చిన దర్శకుడు ప్రశాంత్ వర్మతో అంటే? అంచనాలు పీక్స్ లోకి వెళతాయి. కాగా ఇపుడు ప్రశాంత్ వర్మ ఇదే సెన్సేషనల్ కాంబినేషన్ పై వర్క్ చేస్తున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.

ఆల్రెడీ మోక్షజ్ఞ ఎంట్రీపై భారీ అంచనాలు ఉన్నాయి. మరి దీనికి తోడు బాలయ్య లాంటి మాస్ ఫోర్స్ తోడైతే అది ఇంకా గ్రాండ్ గా ఉంటుంది అని చెప్పాలి. మరి ఈ క్రేజీ కలయికలో సినిమా పై అధికారిక అనౌన్సమెంట్ కోసం అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
కాగా మరోపక్క బాలయ్య ఇప్పుడు తన కెరీర్ 109వ సినిమా దర్శకుడు బాబీ కొల్లితో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఊర్వశి రౌటేలా, ప్రగ్యా జైస్వాల్ లు నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నాడు. అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ లపై నాగవంశీ, త్రివిక్రమ్ లు నిర్మాణం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











