అల్లు అర్జున్ కు టాప్ ప్రొడ్యూసర్ గుడ్ బై! ఏం జరిగిందంటే?
ప్రెజెంట్ ఇండియన్ సినిమా దగ్గర ఉన్నటువంటి టాప్ మోస్ట్ హీరోస్ లో పాన్ ఇండియా లెవెల్లో సెన్సేషన్ గా మారిన తెలుగు హీరోలే ఎక్కువగా కనిపిస్తారు అని చెప్పవచ్చు. కాగా ఇలా తెలుగు నుంచి వెళ్లి పాన్ ఇండియా లెవెల్లో పాగా వేసిన అతి కొద్ది మంది హీరోస్ లో ఇపుడు తెలుగు హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా ఒకరు. కాగా అల్లు అర్జున్ హీరోగా చేసిన ఎన్నో సినిమాల్లో ఫైనల్ గా పుష్ప సినిమాలతో తన పాన్ ఇండియా క్రేజ్ ని తాను ప్రూవ్ చేసుకున్నాడు.
అయితే ఇక నెక్స్ట్ తన సినిమాలపై భారీ హైప్ లే ఉంటాయి అన్నీ వెయ్యి కోట్లు సినిమాలు రికార్డు బడ్జెట్ లు అల్లు అర్జున్ పై వస్తాయి అని ఫ్యాన్స్ అనుకున్నారు కానీ ఇపుడు అల్లు అర్జున్ మార్కెట్ పై ఇంకా పలు సందేహాలు కొనసాగుతున్నాయట. తెలుగులో ఎందుకో అల్లు అర్జున్ అంటే ఒక బిగ్ స్టార్ లా ఫీల్ అవ్వరు.

తన సినిమాలకి సెన్సేషనల్ లాంగ్ రన్ ఉన్నప్పటికీ సూపర్ స్టార్ మహేష్ బాబు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రేంజ్ లో ఒక కల్ట్ ఫాలోయింగ్ ఉన్న హీరోలా చూసేది చాలా తక్కువే అని చెప్పవచ్చు. దీనితో తన మార్కెట్ పరంగా ఇప్పటికీ పలు డౌట్స్ ఉన్నాయి కానీ లేటెస్ట్ గా పుష్ప 2 సినిమాతో హిందీ సినిమాలో దుమ్ము లేపిన బన్నీ నెక్స్ట్ సినిమాకి కూడా క్రేజీ ప్లానింగ్ లు తాను చేస్తున్నాడు.
కాగా వీటిలో తమిళ దర్శకుడు అట్లీతో ఓ భారీ సినిమా తాను చేయనున్నట్టుగా పుకార్లు చాలా జోరుగానే కొనసాగుతున్నాయి. కాగా ఈ కాంబినేషన్ పైనే ఓ ఊహించని టాక్ ఇపుడు వైరల్ గా మారింది. నిజానికి ఈ సినిమాని తమిళ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ చేయాలి అనుకున్నారట. కానీ ఈ సినిమా తాము అనుకున్న బడ్జెట్ కి మించి వెళుతుంది అని వారు ఆ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు మొదలయ్యాయి.

అయితే గత సినిమాతో వరల్డ్ వైడ్ గా 1800 కోట్లు వసూళ్లు రాబట్టిన హీరో ఉన్నప్పటికీ వారు బడ్జెట్ విషయంలో వెనక్కి వెళ్లిపోయారు అంటే అల్లు అర్జున్ మార్కెట్ పై వారికి నమ్మకం లేకనే అని పలు కామెంట్స్ ఇపుడు మొదలయ్యాయి. మెయిన్ గా వారు రిస్క్ తీసుకోదలచుకోలేదు అని తెలుస్తుంది. పుష్ప 2 కి అంటే ఆ పాత్ర పాన్ ఇండియా లెవెల్లో బాగా క్లిక్ అయ్యింది కాబట్టి ఆ రేంజ్ లో వసూళ్లు వచ్చాయి.
కానీ ఇపుడు ఆ రేంజ్ లో వసూళ్లు నెక్స్ట్ సినిమాకి వస్తాయని గ్యారెంటీ లేదు కదా? అందుకే భారీ బడ్జెట్ పెట్టడానికి సన్ పిక్చర్స్ అల్లు అర్జున్ విషయంలో డేర్ చేయలేకపోయారని తెలుస్తుంది. దీనితో ఇది మాత్రం ఒకింత బన్నీకి అవమానకరంగానే మారింది అని సోషల్ మీడియాలో కూడా పలు ట్రోల్స్ మొదలయ్యాయి. కాగా ఈ బిగ్ కాంబినేషన్ విషయంలో ఎంతవరకు నిజం ఉందో కానీ సన్ పిక్చర్స్ వారు తప్పుకునేసరికి ఈ సినిమాని తెలుగు టాప్ ప్రొడ్యూసర్ ఒకరు టేక్ చేసినట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి చూడాలి అల్లు అర్జున్ నెక్స్ట్ విషయంలో ఎప్పుడు సస్పెన్స్ వీడుతుంది అనేది.


Click it and Unblock the Notifications











