ఆ ఫ్యామిలీని నమ్ముకొన్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా హిట్ కొడుతాడా?

అప్పటివరకు ఒక రకంగా వెళుతున్న టాలీవుడ్ సినిమాలో ఒక పాత్ బ్రేకింగ్ ముద్ర వేసిన దర్శకుల్లో ఎస్ ఎస్ రాజమౌళి కూడా ఒకరు. అయితే అలాంటి దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తనకి పాన్ వరల్డ్ లెవెల్ కథలు అందించే రచయితా తన తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ లాంటి రచయితకి ప్రేరణగా నిలిచిన దర్శకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది మొహమాటం లేకుండా సెన్సేషనల్ దర్శకుడు పూరి జగన్నాథ్ అని చెప్పవచ్చు.

తెలుగు సినిమా దగ్గర హీరోస్ లో ఊర మాస్ గా ప్రెజెంట్ చేయడంలో పూరి జగన్నాథ్ తర్వాతే అనే రేంజ్ క్రేజ్ ఒకప్పుడు తనకి సొంతం. రాజమౌళి కూడా టచ్ చెయ్యలేని రికార్డు సినిమాలు పూరి అప్పట్లోనే ఇచ్చేసారు. మరి తెలుగు సినిమాలో ఎన్నెన్నో కమర్షియల్ సినిమాలు ఆల్ టైం రికార్డులు అందించిన దర్శకుడు పూరి జగన్నాథ్ ఇపుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో అందరికీ తెలిసిందే.

Is puri jagannath planning his comeback with Akkineni heros

ఒకప్పుడు ఎంతో వెలిగిన పూరి జగన్నాథ్, శంకర్ లాంటి దర్శకులు ఇపుడు ఒక హిట్ కోసం స్ట్రగుల్ అవుతుండడం అనేది తమ ఫ్యాన్స్ కి మాత్రమే కాకుండా మూవీ లవర్స్ కి కూడా ఒకింత బాధ గానే ఉంటుంది. కాగా ఇలా తెలుగు సినిమా దగ్గర పూరి జగన్నాథ్ కంబ్యాక్ కోసం చాలా మంది ఎదురు చూస్తుండగా తాను తెరకెక్కించిన గత రెండు సినిమాలూ లైగర్, డబుల్ ఇస్మార్ట్ లు ఒకదాన్ని మించిన ఒకటి డిజాస్టర్స్ గా నిలిచిపోయాయి.

దీనితో పూరి జగన్నాథ్ ఉనికికి కూడా సమస్య వచ్చింది. ఒకప్పుడు తెలుగు సినిమాలో నెంబర్ 1 దర్శకుడు ఇపుడు ఒక హీరో కోసం ఎదురు చూస్తున్నాడు. కాగా ఇపుడు తన కంబ్యాక్ కోసం పూరి ఓ ఫ్యామిలీ హీరోస్ తో టచ్ లో ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. పూరి జగన్నాథ్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడు సీనియర్ స్టార్స్ తో కూడా పలు సినిమాలు చేసిన సంగతి తెలిసిందే.

కాగా అలా చేసిన వారిలో అక్కినేని హీరో అక్కినేని నాగార్జున కూడా ఒకరు. శివమణి, సూపర్ అనే క్రేజీ సినిమాలు నాగార్జునకి పూరి జగన్నాథ్ అందించడం జరిగింది. కాగా ఇపుడు మళ్ళీ నాగార్జునతోనే తన కంబ్యాక్ ని పూరి జగన్నాథ్ ప్లాన్ చేసుకున్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇక వీటితో పాటుగా అక్కినేని కుటుంబం నుంచే మరో యంగ్ హీరోతో కూడా పూరి టచ్ లో ఉన్నారు అంటూ మరికొన్ని రూమర్స్ ఉన్నాయి.

Is puri jagannath planning his comeback with Akkineni heros

కాగా ఈ హీరో అఖిల్ అక్కినేని అన్నట్టుగా తెలుస్తుంది. మరి ఈ ఇద్దరిలో ఎవరితో పూరి సినిమా ఉంటుంది అనేది వేచి చూడక తప్పదు. ప్రస్తుతం నాగార్జున కొన్ని సినిమాల్లో గెస్ట్ రోల్స్ మాత్రమే చేస్తున్నారు తప్పితే సోలోగా హీరోగా చేస్తున్న సినిమాలు పెద్దగా లేవు. అఖిల్ కూడా ఏజెంట్ సినిమా తర్వాత ఓ దర్శకునితో ఆల్రెడీ స్టార్ట్ చేసినట్టు టాక్ ఉంది. సో నాగార్జున, పూరి జగన్నాథ్ కాంబినేషన్ సాధ్యం అయ్యే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం నాగ్ కి పూరి అందించిన లైన్ నచ్చినట్టు గానే పలు పుకార్లు ఉన్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X